Weight Loss Tips:కేవలం 1 గ్లాస్ 14 రోజుల్లో స్పీడ్ గా బరువు తగ్గి సన్నగా అవ్వాలంటే ఎవరు చెప్పని బెస్ట్ టెక్నిక్
Weight Loss and belly fat Tips In telugu : ఈ మధ్య కాలంలో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. బరువు పెరగటం అనేది చాలా స్పీడ్ గా జరిగిపోతుంది. అదే తగ్గాలంటే చాలా కష్టం అవుతుంది. మంచి పోషకాహారం తీసుకుంటూ వ్యాయామం లేదా యోగా చేస్తూ ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే మంచి ప్రయోజనం కలుగుతుంది.
టమోటా బరువు తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది. టమోటాలో ఉండే కరిగే మరియు కరగని ఫైబర్ బరువు తగ్గించటంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. జీవక్రియ బాగా జరిగేలా చేస్తుంది. జీవక్రియ బాగా జరిగితే ఆహారం బాగా జీర్ణం అయ్యి కొవ్వుగా మారకుండా శక్తిగా మారుతుంది.
టమోటాలో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. అవి శరీరం యొక్క ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడతాయి. దాంతో మరింత బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఈ రెమిడీ కోసం ఒక టమోటాను ఉడికించాలి.
ఉడికిన టమోటా తొక్క తీసేసి మిక్సీలో వేసి కొంచెం నీటిని పోసి జ్యూస్ గా చేయాలి. ఈ జ్యూస్ ని వడకట్టి పావుస్పూన్ లో సగం ఉప్పు కలిపి ఉదయం లేదా సాయంత్రం సమయంలో తీసుకోవాలి. ఈ విధంగా రెండు వారాల పాటు తీసుకుంటే బరువు తగ్గుతారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.