Black pepper:ఈ గింజలను ఇలా వాడితే మీ శరీరంలో కలిగే మార్పులు…ఏమిటో…?
Black pepper health Benefits In telugu : మిరియాలు కాస్త ఘాటుగా ఉంటాయని చాలా మంది తినటానికి పెద్దగా వాడరు. దీనిలో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే తప్పనిసరిగా తినటం అలవాటు చేసుకుంటారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మిరియాలను వాడటం తప్పనిసరి. ప్రతి రోజు మిరియాలను తీసుకోవాలి.
తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవ్వటానికి,గ్యాస్ సమస్య,మల బద్దకం వంటి సమస్యలు ఉండవు. క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. బరువు తగ్గాలని ప్రణాళికలో ఉన్నవారికి మిరియాలు మంచి ఎంపిక. ఇవి కొవ్వు కణాలు ఏర్పడకుండా చేస్తాయి.డయబెటిస్ ఉన్నవారిలో రక్తంలో గ్లూకోజ్ వేగంగా చేరకుండా చేస్తుంది.
నల్ల మిరియాలను వాసన పీల్చుతూ ఉంటే…పొగతాగే అలవాటు పోతుందని ఇటీవల జరిగిన పరిశోదనలో తేలింది. గొంతులో గరగర, దగ్గు, జలుబు,ఆస్తమా వంటి సమస్యలు తగ్గుతాయి. చర్మంపై ఉండే మృత కణాల్ని తొలగించి చర్మం మెరిసేలా చేస్తుంది. చర్మానికి రక్తం, ఆక్సిజన్ బాగా సరఫరా అయ్యేలా ఇవి చేస్తాయి.
బొల్లి సమస్య తగ్గించటానికి సహాయపడుతుంది. ఒత్తిడి తగ్గించటానికి మిరియాలు బాగా పనిచేస్తాయి. నల్ల మిరియాల్లోని పైపెరిన్ అనే పదార్థం… మెదడుని కాపాడి మతిమరుపు రాకుండా చేస్తుంది. చుండ్రు సమస్యను తగ్గిస్తుంది. గాయాలు అయ్యినప్పుడు ఇన్ ఫెక్షన్స్ కాకుండా కాపాడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.