MoviesTollywood news in telugu

RRR ఒక్క రోజు షూటింగ్ ఖర్చు ఎంతో తెలుసా ?

RRR Movie : బాహుబలి తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి భారీ బడ్జెట్ తో మల్టీస్టారర్ మూవీగా అందునా పాన్ ఇండియా మూవీగా తెర కెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ (రౌద్రం.. రణం.. రుధిరం) షూటింగ్ పూర్తికావడంతో రిలీజ్ దగ్గర పడింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్‌ మూవీలో బాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్నారు. అందుకే ఆర్ ఆర్ ఆర్ మూవీపై తారక్, చెర్రీ ఫాన్స్ తో పాటు ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక సినిమా ట్రైలర్‌, సాంగ్స్, మేకింగ్‌ వీడియోస్‌ చూసాక ఈ అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ మూవీ బడ్జెట్‌ 400 కోట్ల రూపాయలని చెబుతున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ఒక రోజు షూటింగ్ ఖర్చు గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మూవీ ప్రమోషన్స్‌ వేగం మరింత పెరిగింది. ముఖ్యంగా అనేక మీడియా సంస్థలకు రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌ ఇంటర్వ‍్యూలు ఇస్తున్నారు

ఇందులో భాగంగా జక్కన్న చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. షూటింగ్‌ సమయంలో ఎక్కువగా టెన్షన్‌కు గురి చేసిన విషయం ఏంటని అడిగి నప్పుడు జక్కన్న స్పందిస్తూ,’భారీ సెట్లు వేసి పెద్ద యూనిట్లతో సినిమా తీస్తున్నప్పుడు ఏదైనా తప్పు జరిగితే ఎక్కువ టెన్షన్‌కు గురి చేస్తుంది. ఒక్క రోజు షూటింగ్‌కు 75 లక్షల రూపాయలు ఖర్చయ్యేది. అందుకే అనుకున్నది అనుకున్నట్టుగా జరగకుంటే నాకు విపరీతమైన కోపం వచ్చేసేది’ అని వివరించాడు.