MoviesTollywood news in telugu

Ravi teja Movie:”నీకోసం” సినిమా ఎంత మందికి లైఫ్ ఇచ్చిందో తెలుసా?

Ravi Teja Nee Kosam Movie details: రవితేజ హీరోగా 1999 డిసెంబర్ 3న నీకోసం మూవీ రిలీజయింది. శ్రీను వైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీలో మహేశ్వరీ హీరోయిన్ గా చేసింది. తాతినేని రామారావు డైరెక్షన్ లో వచ్చిన ప్రాణానికి ప్రాణం మూవీ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన శ్రీను వైట్ల ఆసమయంలోనే నీకోసం మూవీ కథ కు శ్రీకారం చుట్టాడు.

ప్రాణానికి ప్రాణం డిజాస్టర్ కావడంతో అందులో తప్పొప్పులు సరిచేస్తూ తన కథను రూపొందించాడు. అదే సమయంలో అమ్మదొంగా మూవీకి సాగర్ దగ్గర అసిస్టెంట్ గా శ్రీను వైట్ల పనిచేసాడు.ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ నటించిన అబ్బాయిగారు సినిమాకు ఈవీవీ సత్యనారాయణ దగ్గర అసిస్టెంట్ గా చేసాడు. ఇలా శ్రీను వైట్ల పనిలో మెళుకువలు నేర్చుకుని నీకోసం మూవీ స్క్రిప్ట్ మరింత కట్టుదిట్టంగా మలిచాడు.

రామ్ గోపాల్ వర్మ దగ్గర కూడా చేరి, పనిచేస్తున్న సమయంలో రవితేజ పరిచయం అయ్యాడు.నిజానికి జెడి చక్రవర్తితో నీకోసం సినిమా చేయాలనుకున్న శ్రీను వైట్ల ఆ తర్వాత పునరాలోచనలో పడ్డాడు. గులాబీ మూవీ హిట్ కావడం, ఎస్వీ కృష్ణారెడ్డి వంటి డైరెక్టర్స్ దగ్గర చేస్తున్న జేడీతో సినిమా కష్టం అనిపించింది. మరోవైపు డాక్టర్ రాజశేఖర్, సాక్షి శివానంద్ జంటగా అపరిచితుడు మూవీ చేసే ఛాన్స్ శ్రీను వైట్లకు వచ్చింది.

అయితే ఆర్ధిక కారణాల వలన షూటింగ్ మధ్యలోనే ఈ మూవీ ఆగిపోయింది. అయితే నీకోసం మూవీ తీయడానికి 40లక్షలతో నిర్మాత దొరికాడు. దాంతో రవితేజను హీరోగా పెట్టుకున్నాడు. 28రోజుల్లో పూర్తిచేద్దామను కున్న మూవీ 8నెలలు పట్టింది. దేవిశ్రీ ప్రసాద్ ని మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటే ఆర్పీ పట్నాయక్ ని తీసుకున్నారు.

55లక్షలతో మూవీ పూర్తయింది. సినిమా చూసిన రామోజీరావు 80లక్షలకు కొన్నారు. ఫుల్ రన్ లో కోటి రూపాయలు కలెక్ట్ చేసింది. అలా హిట్ కొట్టిన శ్రీను వైట్లకు తన బ్యానర్ లో ఆనందం మూవీ చేయడానికి రామోజీరావు ఛాన్స్ ఇచ్చారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం వంటి సినిమాలతో రవితేజ బిజీ అయ్యాడు. చిత్రం, నువ్వునేను మూవీస్ తో ఆర్పీ పట్నాయక్ బిజీ అయ్యాడు. ఇక నాగార్జున సూచనతో కామెడీ జోడించి సినిమాలు తీస్తూ స్టార్ డైరెక్టర్ గా మారాడు శ్రీను వైట్ల.