స్టార్ హీరోయిన్స్ డ్రెస్సులు ధరలు తెలిస్తే గుండె గుభేల్ మంటుంది
Bollywood Actresses Dress : సినిమాల్లో స్టార్ హీరోలు,హీరోయిన్స్ గా రాణిస్తున్న వాళ్ళు తమ హోదాకు తగ్గట్టు వస్తువులు,ఆభరణాలు, బట్టలు వాడుతుంటారు. ఇది సహజమే. అందుకే వాళ్ళ ఖరీదైన వస్త్రాలు, వస్తువుల గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా హీరోయిన్స్ ధరించే డ్రెస్సుల ఖరీదు చూస్తే షాకవ్వాల్సిందే. ముఖ్యంగా బాలీవుడ్ భామలు ధరించే డ్రెస్సులు రేట్లు మాములుగా ఉండవు.
అభిషేక్ బచ్చన్ తో పెళ్లి సందర్బంగా ఐశ్వర్య రాయ్ బంగారు తీగతో నేసిన 75లక్షల విలువైన చీర ధరించిందని అప్పట్లో వార్తలొచ్చాయి. నటి శిల్పాశెట్టి, రాజీవ్ కుంద్రా పెళ్ళిలో శిల్పా ధరించిన స్వరోస్కి క్రిష్టల్ తో కూడిన డ్రెస్ కి ఏకంగా 50లక్షలు అయిందట. తరుణ్ తాహిలియాన్ దీన్ని డిజైన్ చేసారు.
అలాగే అనుష్క శర్మ తన పెళ్ళిలో 30లక్షల విలువైన సవ్యసాచి డిజైన్ లెహంగా ధరించింది. ఇక 2020లో ప్రియాంక చోప్రా పెళ్లి సందర్బంగా డైమండ్ జెరీతో తయారుచేసిన డీప్ నెక్ డ్రెస్ ధరించింది. దీని ఖరీదు 77లక్షలని అప్పట్లో టాక్.
సినిమా షూటింగ్ కోసం దుబాయి వెళ్ళినపుడు ఊర్వశి రౌతాలా చాలా విలువైన వస్తువులు ధరించింది. వీటి ఖరీదు 37 కోట్ల రూపాయలట. అమెరికన్ డాలర్ల ప్రకారం 5మిలియన్ డాలర్స్. ఇక ఈమె మిస్ యూనివర్స్ 2021లో జడ్జిగా వ్యవహరించినపుడు 40లక్షల విలువైన వజ్రాలు పొదిగిన నల్లరంగు దుస్తులు ధరించింది. 2019లో దీపికా పదుకునే ధరించిన డ్రెస్ తయారు చేయడానికి 160గంటలు పట్టిందట. 50లక్షల 50వేల రూపాయల విలువైన ఈ డ్రెస్ ధరించి పింక్ కార్పెట్ పై నడిచి అందరి దృష్టిని ఆకర్షించింది.