30 రోజులు తాగితే డయబెటిస్, కొలెస్ట్రాల్, అధిక బరువు, కంటి చూపు.. లాంటి ఎన్నో సమస్యలు తగ్గుతాయి..!
Munagaku uses in telugu : మునగలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మునగకాడలే కాదు, ఆకుల వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా లభిస్తాయి. మునగ ఆకులు అధిక బరువును తగ్గించి, పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.
నిమ్మ జాతి పండ్ల కంటే మునగాకులో విటమిన్ సి ఏడు రెట్లు అధికంగా ఉంటుంది. పొటాషియం అరటి పళ్లలో కంటే 15 రెట్లు ఎక్కువగా ఈ ఆకులో ఉంటాయి. ప్రొటీన్లు, విటమిన్ ఎ, కాల్షియం కూడా మునగాకుల్లో విరివిగా లభిస్తాయి. శరీరంలో విషాలను తొలగిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచి జీవక్రియలను ఉత్తేజితం చేస్తుంది. కంటి చూపు మెరుగుదలకు సహాయపడుతుంది.
డయబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేసి డయబెటిస్ అంటే షుగర్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేసి రక్తప్రసరణ బాగా జరిగేలా చేసి గుండెకు సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. థైరాయిడ్ హార్మోన్ చర్యలను అదుపులో ఉంచుతుంది.
ఒక కప్పు నీటిలో పావు కప్పు మునగ ఆకులు వేసి మిక్సీలో బాగా గ్రైండ్ చేసి రసాన్ని తీసుకోవాలి. ఈ రసంలో అరచెక్క నిమ్మరసం, ఒక స్పూన్ తేనె వేసి బాగా కలిపి తాగాలి. ఈ డ్రింక్ ని రాత్రి లేదా సాయంత్రం సమయంలో తాగాలి. ఈ విధంగా 30 రోజుల పాటు తాగితే అధిక బరువు, శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది.