Hemoglobin Increase Foods:ప్రతి రోజు తింటే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి జీవితంలో రక్తహీనత సమస్య అనేది ఉండదు..
Hemoglobin increase Foods : ఈ మధ్య కాలంలో రక్తహీనత సమస్య అనేది చాలా ఎక్కువగా కనపడుతుంది. ఈ సమస్యను అసలు అశ్రద్ద చేయకూడదు. ఐరన్ సమృద్దిగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. మన శరీరంలోని రక్తం ఎర్రగా ఉండడానికి కారణం అందులోని హీమోగ్లోబిన్ అనే పదార్థం.
ఇది తయారవడానికి మాంసకృత్తులతో పాటు ఐరన్ అనే పోషక పదార్థం ముఖ్యంగా అవసరం. మన శరీరంలో హీమోగ్లోబిన్ పరిమాణం ఒక మోతాదులో ఉంటుంది. ఉదాహరణకు మగవారిలో ప్రతి 100 గ్రాముల రక్తంలో 13 గ్రాములు, ఆడవారిలో 12 గ్రాములు, 6 సంవత్సరంలోపు పిల్లల్లో 11 గ్రాములు, గర్భిణీ స్త్రీలలో 11 గ్రాములు, బాలింతలలో 12 గ్రాములు, 6 నుండి 12 సం.ల లోపు పిల్లలలో్ 12 గ్రాములు ఉండాలి.
ఒకవేళ హీమోగ్లోబిన్ మోతాదు ఈ విలువల కన్నా తగ్గితే రక్త హీనతతో బాధపడుతున్నట్లు గుర్తించాలి. ఈరోజు రక్తహీనత సమస్యను తగ్గించు కోవటానికి 2 ఆహారాలను తెలుసుకుందాం. ఖర్జూరంలో ఉండే ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది.
ఇవి రోగ నిరోధకశక్తిని పెంపొందించడమే కాకుండా రక్తహీనత సమస్యతో బాధపడేవారికి ఎంతో మేలు చేస్తుంది.ఖర్జూరాలను రోజూ నానబెట్టి తింటే శరీరానికి అవసరమైన శక్తి వస్తుంది. విటమిన్ సప్లిమెంట్లతో పని ఉండదు.రక్తహీనతతో బాధపడేవారు ఖర్జూర పండ్లలో పాలు, మీగడ లేదా నెయ్యి కలిపి ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే మంచిది.
నలుపు నువ్వులలో తెల్లనువ్వులతో పోలిస్తే ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. నువ్వులు హిమోగ్లోబిన్ స్థాయిలు మెరుగుపరచడానికి మరియు ఇనుము యొక్క శోషణ ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. రోజుకి ఒక స్పూన్ నువ్వులు, 3 ఖర్జూరాలు తింటే రక్తహీనత సమస్య నుండి బయట పడవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.