ఈ టాలీవుడ్ స్టార్ హీరోని గుర్తు పట్టారా…?
Tollywood hero Mahesh babu : సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీల వివరాలే కాదు, అరుదైన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. తాజాగా బ్లాక్ కలర్ క్యాప్, వైట్ మాస్క్ పెట్టుకుని సెల్ఫీలకు పోజ్ ఇస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు దిగిన ఫోటో వైరల్ గా మారింది. అసలే అందగాడు, పైగా క్రిస్మస్ వేడుకల సందర్భంగా స్టైలిష్‌గా మారాడు. చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో తన నటనతో అదరగొట్టాడు.
ఇక మహేష్ బాబు పెద్దయ్యాక రాజకుమారుడు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, ప్రిన్స్ స్టార్ నుంచి ఒక్కో విజయాన్ని అందుకుంటూ సూపర్ స్టార్ అయ్యాడు. బాక్సాఫీస్ రికార్డులతో పాటు, అవార్డులతో పాటు భారీ ఫాన్ ఫాలోయింగ్ కూడా తెచ్చుకున్నాడు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా తన గారాల తనయ సితారతో కలిసి ఇలా సెల్ఫీలకు స్టైలిష్‌గా పోజ్ ఇచ్చాడు.
తాజాగా పరుశురామ్ దర్శకత్వం వహిస్తోన్న సర్కార్ వారి పాట మూవీ లో నటిస్తున్న మహేశ్ బాబు సర్జరీ కారణంగా కొన్నాళ్లుగా కెమెరాకు దూరంగా ఉంటున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. టీజర్ కూడా ఫాన్స్ ని ఫిదా చేసింది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టై న్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో సముద్ర ఖని, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు కీలక పాత్రలు చేస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా తొలిసారి మహేష్ తో జోడీ కడుతోంది.