Fenugreek Leaves: ఈ కాలంలో మెంతికూర తింటున్నారా లేదా? అస్సలు మిస్సవ్వద్దు..
Menthi Kura Health benefits in telugu : ఈ చలికాలంలో ఆకుకూరలు విరివిగా లభిస్తున్నాయి. తక్కువ ఖర్చులో ఎక్కువ పోషకాలను అందిస్తాయి. అలాంటి ఆకుకూరల్లో మెంతి కూర గురించి తెలుసుకుందాం. మెంతి కూరను తప్పనిసరిగా చలికాలంలో తినాలి. విటమిన్ ఏ సమృద్దిగా ఉండుట వలన కంటి చూపు బాగుంటుంది.
calcium సమృద్దిగా ఉండుట వలన ఎముకలు బలంగా,ఆరోగ్యంగా ఉండటమే కాకుండా కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. 30 సంవత్సరాలు దాటిన మహిళలు తప్పనిసరిగా వారంలో రెండు సార్లు మెంతి కూర తినాలి. అలాగే ఆడవారిలో ఎక్కువగా కనిపించే నడుము నొప్పి ఉపశమనానికి సహాయపడుతుంది. ఇంకా పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పిని కూడా తగ్గిస్తుంది.
మెంతులలో కావలసినంత పీచు పదార్దాలు, ఐరన్, విటమిన్-సి, బి1, బి2 ఉంటాయి. అందువల్ల రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. రక్తహీనత సమస్య ఉన్నవారు వారంలో మూడు సార్లు తింటే మంచిది. చలికాలంలో వచ్చే జీర్ణ సంబంద సమస్యలను తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ లేకుండా మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది.
రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అధిక బరువు సమస్యను కూడా తగ్గిస్తుంది. మెంతి కూరను తాజాగా దొరికినప్పుడు తాజాగా వాడుకోవాలి. ఈ ఆకులను ఎండబెట్టి కూడా కొన్ని ఆహార పదార్ధాలలో వాడవచ్చు. ఎండిన ఆకులు సైతం ఎంతో మేలు చేస్తాయి. మెంతి ఆకులను ఎండబెట్టి సంవత్సరం పొడవునా వాడుకోవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.