Mushroom: పుట్టగొడుగులతో పుట్టెడు లాభాలు.. ఇవి తింటే ఆ రోగాలనుంచి రక్షణ ఉంటుందట..
mushroom benefits And Side Effects in telugu :మన ఆరోగ్యాన్నికాపాడుకోవడానికి పుట్టగొడుగులు చాలా సాయం చేస్తాయి. ఇవి ఫంగీ జాతికి చెందిన మొక్కలు. మష్రూమ్స్‌లో ఎన్నోరకాల పోషక విలువలు ఉన్నాయి. కాన్సర్, డయాబెటిస్, ఊబకాయం, గుండె సంబంధ రుగ్మతలు ఉన్నవారు వీటిని తీసుకోవడం మంచి ఫలితాలు పొందుతారు.
ఈ మధ్య కాలంలో మారిన పరిస్థితి కారణంగా తీసుకొనే ఆహారం విషయంలోనూ అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ద పెడుతున్నారు. ఒకప్పుడు పుట్టగొడుగులు అంటే పెద్దగా ఎవరు తినటానికి ఆసక్తి చూపేవారు. ఇప్పుడు అందరూ తింటున్నారు. వీటిల్లో ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. పుట్ట గొడుగులలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది.
దాంతో ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. బరువు తగ్గాలనే ప్రణాళికలో ఉన్నవారికి కూడా పుట్టగొడుగుల చాలా బాగా సహాయపడుతాయి. ఆకలిని తగ్గించి ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోకుండా చేస్తుంది. వీటిని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే శరీరానికి అవసరమైన విటమిన్ డి లభిస్తుంది.
వీటిలో మాంసకృత్తులు ఎక్కువగాను పిండిపదార్థం తక్కువగాను ఉండటం వలన డయాబెటిస్ ఉన్నవారికి మంచి ఆహారం అని చెప్పవచ్చు. . ఇందులో ఉండే పొటాషియం పక్షవాతాన్ని నివారిస్తుంది. అంతేకాకుండా రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి రక్తప్రవాహానికి అడ్డంకులు లేకుండా సాఫీగా జరిగేలా చేసి చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది.
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా చేస్తుంది. ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. వీటిలో ఉండే కాపర్ ఎర్రరక్తకణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది రక్తహీనత సమస్యతో బాధ పడుతున్నారు.
ఈ రోజుల్లో సమస్య వచ్చింది అంటే తగ్గాలి అంటే చాలా కష్టం. సాధ్యమైనంతవరకు సమస్యలు లేకుండా చూసుకోవడం బెటర్. అయితే పుట్టగొడుగులు ఎక్కువగా వాడితే కొన్ని సైడ్ ఎఫ్ఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పుట్టగొడుగుల అతి వాడకం వల్ల విరోచనాలు, వాంతులు, వికారం వంటి ఉదర సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
పుట్టగొడుగులు శిలీంధ్రాలు కాబట్టి కొంతమందిలో వీటిని తిన్న వెంటనే విరేచనాలు అవుతాయి. కొందరికి వీటి వాసన, రుచి అసలే పడదు. ఇలాంటివారు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేదంటే సమస్యలు తప్పవు. కొంతమందిలో మైకం లేదా నిద్రమత్తు వస్తుంది. అలాగే మానసిక సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది.
చర్మంపై దద్దుర్లు, ర్యాషెస్ వంటివి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పిన సమస్యలు కనిపిస్తే మాత్రం పుట్ట గొడుగులకు దూరంగా ఉంటేనే మంచిది. ఏదైనా లిమిట్ గా తీసుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు. కాబట్టి పుట్టగొడుగులు తినే ముందు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/