saturday feed to crows:శనివారం కాకులకు అన్నం పెడితే ఏమి అవుతుందో తెలుసా?
saturday feed to crows : ఏడేళ్లు శని పట్టి పీడిస్తోందని,అందుకే ఏలిన నాటి శని అని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే ఏలిన నాటి శని పూర్తయ్యే సమయంలో శని మంచి చేసి వెళ్ళిపోతాడని అంటారు. ఈలోగా శనిదోష నివారణకు పూజలు నిర్వహించాలని చెబుతూ ఉంటారు.
నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ, నువ్వుల నూనెతో శనీశ్వరునికి అభిషేకం చేస్తే మంచిదని, గ్రహ పీడలు వదిలి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని అంటారు. ఇక శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామితో పాటు శనీశ్వరునికి కూడా ప్రీతికరమని అంటారు. నిజానికి భక్తులపట్ల దయా హృదయంతోనే శనీశ్వరుడు ఉంటాడని అంటారు.
అందుకే శనివారం చాలామంది ఇళ్లల్లో శ్రీ వేంకటేశ్వర స్వామికి, శనీశ్వరునికి దీపారాధన చేస్తారు. శనివారం ఉదయాన్నే నువ్వుల నూనెతో అభ్యంగన స్నానమాచరించి, నువ్వులను మూటకట్టి శనీశ్వరునకు సమర్పించి, నువ్వుల తైలంతో అభిషేకం చేయాలని అంటారు.
అంతేకాకుండా నువ్వులు కలిపిన అన్నం కాకులకు పెట్టి , అనంతరం భోజనం చేయాలని కూడా చెబుతారు. ఇలా కాకులకు పెట్టడం వలన ఇబ్బందులు తొలగిపోయి సర్వ సౌఖ్యాలు లభిస్తాయని చెబుతారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.