పరగడుపున అర స్పూన్ చాలు పొట్ట,తొడల దగ్గర కొవ్వు తగ్గటమే కాకుండా నడుము సన్నగా అవుతుంది
Ginger Weight loss Tips : మారిన జీవనశైలి పరిస్థితి, ఎక్కువసేపు కూర్చోవటం, సరైన వ్యాయామం లేకపోవటం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం వంటి కారణాలతో మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు పెరగటం చాలా సులువు. కానీ బరువు తగ్గాలంటే చాలా ప్రయత్నాలు చేయాలి.
మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటూ ప్రతి రోజు అరగంట వ్యాయామం లేదా యోగా చేస్తూ ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే 15 రోజుల్లోనే మీకు తేడా కనపడుతుంది. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. దీని కోసం ఒక బౌల్ లో రెండు స్పూన్ల పసుపు, ఒక స్పూన్ జీలకర్ర పొడి,రెండు అంగుళాల అల్లం ముక్కను తురిమి వేయాలి.
ఆ తర్వాత మూడు స్పూన్ల తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్ లో పెట్టుకొని వారం రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు ఉదయం పరగడుపున అరస్పూన్ మోతాదులో తీసుకొని ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని తాగాలి. ఈ చిట్కా చాలా బాగా సహాయ పడుతుంది. అల్లం,జీలకర్రలో ఉండే లక్షణాలు జీర్ణక్రియకు బాగా సహాయపడతాయి.
పసుపు మార్కెట్ లో దొరికే ప్యాకెట్ కాకుండా పసుపు కొమ్ములను తెచ్చుకొని పొడిగా చేసుకొని వాడితే మంచిది. అలాగే తేనె కూడా ఆర్గానిక్ తేనె అయితే మంచిది. జీలకర్రను కాస్త దోరగా వేగించి పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు తీసుకుంటే శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది. అలాగే ధైరాయిడ్, రక్తపోటు సమస్యలు కూడా తొలగిపోతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.