Healthhealth tips in telugu

ఈ చిట్కా మీ ఊపిరితిత్తుల్లో చేరిన కఫాన్ని అంతం చేసి ఇమ్మ్యూనిటిని రెట్టింపు చేస్తుంది.

Cold And Cough Home Remedies : ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్రతి ఒక్కరిలోనూ రోగనిరోదక శక్తి అధికంగా ఉండవలసిన అవసరం ఉంది. అలాగే ఈ చలికాలంలో దగ్గు,జలుబు, గొంతు నొప్పి వంటివి చాలా తొందరగా వచ్చేస్తాయి. వీటిని అశ్రద్ద చేస్తే ఊపిరితిత్తులలో కఫము పెరుకు పోతుంది. ఇది అనేక రకాల సమస్యలకు దారి తీస్తుంది.

దీని కోసం మంచి చిట్కా ఉంది. మన ఇంటిలో సులభంగా ఉండే వస్తువులతో సులభంగా చేసుకోవచ్చు. ఈ చిట్కా కోసం తమలపాకు,అల్లం,తేనె ఉపయోగిస్తున్నాం. ఒక తమలపాకును శుభ్రంగా కడిగి రసం తీయాలి. అల్లంను కూడా తురిమి రసం తీయాలి. ఒక బౌల్ లో ఒక స్పూన్ అల్లం రసం, ఒక స్పూన్ తమలపాకు రసం,ఒక స్పూన్ తేనె వేసి కలపాలి.
Ginger benefits in telugu
ఈ మిశ్రమాన్ని ఉదయం ఒక స్పూన్, సాయంత్రం ఒక స్పూన్ తీసుకోవాలి. చిన్న పిల్లలకు అయితే అరస్పూన్ సరిపోతుంది. మూడు రోజుల పాటు తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది. తమలపాకులో ఉన్న లక్షణాలు శ్వాసకోశ సమస్యలను, దగ్గు, ఆస్తమా,గొంతులో కఫాన్ని తగ్గించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
Honey
అల్లం,తేనెలో ఉండే లక్షణాలు కూడా దగ్గు,గొంతునొప్పి, ఇన్ ఫెక్షన్, ఊపిరితిత్తులలో కాపాన్ని తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. డయబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తీసుకోవాలి. సమస్య చిన్నగా ఉన్నప్పుడూ ఈ చిట్కా ఫాలో అవ్వవచ్చు. సమస్య కాస్త ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ దగ్గరకు వెళ్ళి ఆ సూచనలను పాటిస్తూ ఈ చిట్కా ఫాలో అయితే తొందరగా ఉపశమనం కలుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.