Healthhealth tips in telugu

రోజు 1 కప్పు తాగితే శరీరంలో బలహీనత,నీరసం,అలసట,నిసత్తువ లేకుండా హుషారుగా ఉంటారు

Energy powder drink : ఈ రోజుల్లో సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి ఏదొక సమయంలో వస్తున్నాయి. ఆ సమస్యలు రాకుండా ఉండాలన్నా వచ్చిన సమస్యలను తగ్గించుకోవటానికి ఈ రోజు ఒక పాలను తయారుచేసుకుందాం. ఈ పాలను తాగితే నీరసం,నిసత్తువ, అలసట లేకుండా చురుకుగా ఉంటారు. దీని కోసం ముందుగా ఒక పొడిని తయారుచేసుకోవాలి.
Is pista good for diabetes In Telugu
పాన్ లో ఒక స్పూన్ నెయ్యి వేసి ఒక కప్పు phool makhana (తామర గింజలు) వేసి వేగించి పక్కన పెట్టాలి. మరల అదే పాన్ లో ఒక స్పూన్ నెయ్యి వేసి పావు కప్పు బాదం పప్పు, పావుకప్పు జీడిపప్పు, పావుకప్పు పిస్తా పప్పు, పావు కప్పు వాల్ నట్స్, నువ్వులు రెండు స్పూన్స్, పావుకప్పులో సగం ఎండుకొబ్బరి వేసి వెగించాలి.
Diabetes patients eat almonds In Telugu
బాగా వేగిన అన్నింటిని మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిలో అరస్పూన్ మిరియాల పొడి, అరస్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. ఈ పొడి దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ పాలను పోసి కొంచెం వేడి అయ్యాక ఒక స్పూన్ పొడి వేసి రెండు నిమిషాలు మరిగించాలి.

ఆ తర్వాత చిన్న బెల్లం ముక్కను వేసి ఒక నిమిషం ఉంచి గ్లాస్ లో పోసి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఈ విధంగా రోజు తాగితే శరీరంలో నీరసం,అలసట,నిసత్తువ,బలహీనత వంటివి అసలు ఉండవు. ఉదయం సమయంలో తాగితే రోజంతా హుషారుగా ఉంటారు. ఈ పాలను అన్ని వయస్సుల వారు తాగవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.