Healthhealth tips in telugu

Weight Loss:రాత్రి వేడి నీళ్లలో ఈ పొడి కలుపుకుని తాగితే 3 నెలల్లో కొవ్వు మొత్తం కరిగి బరువు తగ్గిపోతారు

Weight Loss Drink :రాత్రి వేడి నీళ్లలో ఈ పొడి కలుపుకుని తాగితే 3 నెలల్లో కొవ్వు మొత్తం కరిగి బరువు తగ్గిపోతారు..ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మంచి పోషకాలు ఉన్న ఆహారం తింటూ కనీసం రోజులో అరగంట వ్యాయామం లేదా యోగా చేస్తూ, ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే అధిక బరువు సమస్య, శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును కరిగించుకోవచ్చు.
Ajwain Health Benefits In Telugu
ఈ రెమిడీ కోసం ఒక పొడి తయారు చేసుకోవాలి. 250 గ్రాముల మెంతులు., 100 గ్రాముల వాము, 50 గ్రాములు నల్ల జీలకర్ర తీసుకుని ఈ మూడింటిని పాన్ లో వేసి దోరగా వేగించాలి. వేగిన వీటిని మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పొడి దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది.
black Cumin Seeds
ప్రతిరోజు రాత్రి సమయంలో భోజనం చేసిన తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ పొడి వేసి బాగా కలిపి తాగాలి. ఈ డ్రింక్ తాగిన తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోకూడదు. ఈ విధంగా ఒక 15 రోజులపాటు చేస్తే తేడా మీరే గమనించవచ్చు. శరీరంలో విషాలు అన్ని బయటకు తొలగిపోతాయి.
fenugreek seeds
శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. రక్తం శుభ్రపడుతుంది. అధిక బరువు తగ్గడమే కాకుండా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి .కొవ్వుగా మారకుండా శక్తిగా మారుతుంది. అలాగే బరువు తగ్గినప్పుడు ఎముకలు బలహీనంగా మారకుండా కూడా ఈ పొడి సహాయపడుతుంది.
Weight Loss tips in telugu
కాస్త ఓపికగా ఈ పొడిని తయారుచేసుకొని తీసుకుంటే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరగటమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మీరు కూడా ఈ పొడి వాడి ఈ ప్రయోజనాలను పొందండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ