Healthhealth tips in telugu

మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులను తగ్గించి కీళ్ల మధ్య గుజ్జును రప్పించే అద్భుతమైన చెట్టు

Mahabeera : మోకాళ్ళ నొప్పులను తగ్గించే మహాబీర చెట్టు మన చుట్టుపక్కల కనిపిస్తూనే ఉంటుంది. కానీ ఆ చెట్టు గురించి తెలియక ఏదో పిచ్చి మొక్కగా భావిస్తాము. ఇది చూడటానికి తులసి మొక్కలా కనిపిస్తుంది. కాకపోతే ఆకులు మాత్రం కాస్త పెద్దవిగా ఉంటాయి. ఈ చెట్టు విత్తనాలు మోకాళ్ళ నొప్పులను తగ్గించటానికి చాలా బాగా సహాయపడతాయి.

ఈ విత్తనాలను మహాబీర విత్తనాలు అని పిలుస్తారు. ఇవి ఆయుర్వేదం షాప్ లలో విరివిగా లభ్యం అవుతాయి. రాత్రి సమయంలో అరస్పూన్ గింజలను గ్లాస్ నీటిలో నానబెట్టాలి. ఈ గింజలు మరుసటి రోజు ఉదయానికి సబ్జా గింజల మాదిరిగా తెల్లగా అవుతాయి. కానీ ఈ గింజలకు జిగురు లాంటి పదార్థం ఉంటుంది. ఇదే మోకాలు లో గుజ్జును వచ్చేలా చేస్తుంది.
Joint Pains
ఈ విధంగా మూడు నెలల పాటు తాగితే కీళ్ల మధ్య గుజ్జు పెరిగి కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఇలా తాగటం వలన మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుం నొప్పి, వెన్ను నొప్పి తగ్గుతుంది. అలాగే శరీరంలో పెరుకుపోయిన కొవ్వు కరిగి అధిక బరువు సమస్యను కూడా తగ్గిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
cholesterol reduce foods
ఈ చెట్టు ఆకులను ముద్దగా నూరి రసం తీసుకోవాలి. ఈ రసంను గజ్జి, తామర, దురద ఉన్న ప్రదేశంలో రాస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది. పాదాల పగుళ్లను తగ్గించటానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో ఫ్రీరాడికల్స్ తో పోరాటం చేసి క్యాన్సర్ కణాలను నిరోధిస్తాయి. కాన్సర్ తగ్గించే శక్తి కూడా ఈ విత్తనాలు కూడా ఉంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.