ఇలా చేస్తే చాలు పంటి నొప్పి, చిగుళ్ళ వాపు నిమిషంలో తగ్గిపోతుంది
Teeth Pain : మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో పంటి నొప్పితో బాధపడుతూ ఉంటారు. దంతాలు పుచ్చిపోయినప్పుడు, నోరు శుభ్రంగా లేకపోతే, ఏదైనా ఇన్ ఫెక్షన్ వచ్చినప్పుడు, దంతం యొక్క నరం దెబ్బతిన్నప్పుడు పంటి నొప్పి వచ్చే అవకాశం ఉంది. పంటి నొప్పి ప్రారంభంలోనే ఉంటే ఇప్పుడు చెప్పే చిట్కాలు బాగా సహాయపడతాయి.
పంటి నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ ని సంప్రదించి సూచనలను పాటిస్తూ ఇంటి చిట్కాలను ఫాలో అయితే తొందరగా తగ్గుతుంది. ఒక స్పూన్ ఉల్లిరసంలో ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలిపి నొప్పి ఉన్న ప్రదేశంలో రెండు చుక్కలు వేస్తే సరిపోతుంది. ఈ విధంగా తరచుగా చేస్తూ ఉంటే పంటి నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
మరొక చిట్కా కూడా తెలుసుకుందాం. రెండు వెల్లుల్లి రెబ్బలు, నాలుగు లవంగాలు మెత్తని పేస్ట్ గా చేసి పంటి నొప్పి ఉన్న ప్రదేశంలో పెడితే నొప్పి తగ్గుతుంది. వీటిలో ఉన్న లక్షణాలు నొప్పిని తగ్గించటానికి సహాయపడతాయి. ఇప్పుడు చెప్పిన రెండు చిట్కాలలో ఏదో ఒక దానిని ఫాలో అయితే చాలా తొందరగా తగ్గుతుంది.
ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి ఆ నీటిని నోటిలో పోసుకొని పుక్కిలిస్తే కూడా నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఇప్పుడు చెప్పిన చిట్కాలకు వాడిన అన్నీ ఇంగ్రిడియన్స్ వంటగదిలో అందుబాటులో ఉండేవే. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.