చింతపండు బదులు ఈ పొడి వాడితే కొలెస్ట్రాల్ కరగటమే కాకుండా రక్తహీనతను తగ్గిస్తుంది
Mango Powder : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఏదొక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. అందువల్ల మంచి పోషకాలు ఉన్న ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి. వంటలలో పులుపు కోసం చింతపండు వేస్తూ ఉంటాం. అలా కాకుండా మామిడి పొడి (Mango Powder) వేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మామిడి పొడిని Amchur అని కూడా పిలుస్తారు.
ఈ పొడిని వాడటం వలన మన శరీరానికి ఐరన్ సమృద్దిగా అంది రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య తగ్గుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.డయాబెటిస్ ఉన్నవారికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. అరుగుదల సమస్యలు ఏమి లేకుండా తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. ఒంటి నొప్పులు తగ్గుతాయి.
మామిడి పొడిలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణక్రియలో సహాయపడి కేలరీలు బాగా ఖర్చు అయ్యేలా చేసి బరువు తగ్గటానికి సహాయపడుతుంది. విటమిన్ సి లోపంతో బాధపడేవారికి దివ్య ఔషధం అని చెప్పవచ్చు. ఈ పొడిలో కెరోటినాయిడ్స్ ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఈ పొడిలో విటమిన్ A సమృద్దిగా ఉండుట వలన కంటి చూపు మెరుగుదలకు సహాయపడి కంటికి సంబందించి ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తుంది. మామిడి పొడిలో విటమిన్ ఎ, సి, డి, బి6 మరియు బీటా కెరోటిన్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఇది విషాన్ని తొలగిస్తుంది, శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది.
మామిడి పొడిని ఇంటిలో తయారుచేసుకోవచ్చు. పచ్చి మామిడికాయలను తొక్క తీయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండలో ఆరబెట్టాలి. బాగా ఎండిన ముక్కలను పొడిగా తయారుచేయాలి. ఈ పొడి సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది. మార్కెట్ లో కూడా ఈ పొడి లభ్యం అవుతుంది. అయితే ఉప్పు కలపని పొడి కొనుగోలు చేయాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.