Chapati for Weight Loss:అధిక బరువు తగ్గాలంటే రోజుకు ఎన్ని చపాతీలను తినాలో తెలుసా ?
Chapati for Weight Loss:అధిక బరువు తగ్గాలంటే రోజుకు ఎన్ని చపాతీలను తినాలో తెలుసా.. బరువు తగ్గాలని ఆలోచనలో ఉండేవారు తప్పనిసరిగా ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అన్నంకు బదులుగా చపాతీ తింటే సులభంగా బరువు తగ్గొచ్చు అని నిపుణులు చెబుతున్నారు. దాంతో అందరూ అంటే చాలామంది బరువు తగ్గటానికి చపాతీలను తింటున్నారు. . చపాతీలను చేసుకునే సమయంలో నూనె వాడకుండా కాల్చాలి.
రాత్రి సమయంలో భోజనం మానేసి చపాతీలు తింటే జీర్ణవ్యవస్థ పనితీరు బాగుంటుంది. గోధుమలో ఉండే ఫైబర్ అధిక బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. అయితే బరువు తగ్గడానికి రోజుకు ఎన్ని చపాతీలు తినాలి అనే విషయంలో చాలా మందికి సందేహం ఉంటుంది. చాలా మంది చపాతీలు తింటే బరువు తగ్గుతామని ఎక్కువగా తినేస్తుంటారు.
అలా ఎక్కువ చపాతీలు తినడం వలన బరువు పెరిగేందుకు అవకాశం ఉంది. బరువు తగ్గాలని అనుకొనే వారు మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో చపాతీలను తగిన మోతాదులో తీసుకోవాలి. చపాతీ తింటే కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. అలాగే గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వలన షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
6ఇంచుల సైజులో ఉండే చిన్న చపాతీలో 71 క్యాలరీలు ఉంటాయి. అధిక బరువు తగ్గాలని అనుకొనేవారు మధ్యాహ్నం సమయంలో 2 చపాతీలను, రాత్రి సమయంలో 2 చపాతీలను మాత్రమే తీసుకోవాలి. అంటే రోజుకు నాలుగు చపాతీలను తీసుకుంటే సునాయాసంగా అధిక బరువును తగ్గించుకోవచ్చు. చపాతీలలో క్యారెట్, బీట్ రూట్, కీరదోస, టమాటా వంటి కూరగాయలతో చేసిన సలాడ్ లను తీసుకోవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u