చిన్న పచ్చి కొబ్బరి ముక్క తింటే ఊహించని ప్రయోజనాలు ఎన్నో…అసలు నమ్మలేరు
Raw Coconut benefits in telugu :పచ్చి కొబ్బరి తింటే దగ్గు వస్తుందని,కొలెస్ట్రాల్ పెరుగుతుందని చాలా మంది తినటానికి పెద్దగా ఆసక్తి చూపరు. అయితే వారంలో మూడు సార్లు చిన్న పచ్చి కొబ్బరి ముక్క తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కొబ్బరిలో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. కాబట్టి గుండెకు సంబందించిన సమస్యలు ఉండవు. ముఖ్యంగా థైరాయిడ్ సమస్య ఉన్నవారికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది.
దీనిలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో వ్యర్ధాలను బయటకు పంపుతుంది. దీనిలో బి కాంప్లెక్స్ తో పాటూ విటమిన్లు, ఫొలేట్లు, రైబో ఫ్లేవిన్, నియాసిన్, థయామిన్ లభిస్తాయి. అందువల్ల నోటి పూత సమస్య కూడా తగ్గుతుంది.
పచ్చి కొబ్బరిలో 61 శాతం ఫైబర్ ఉండుట వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి మలబద్దకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. కొబ్బరిలో మీడియం చెయిన్ ట్రై గ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవి కీటోజెనిక్ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.
చర్మంపై ముడతలు,మచ్చలు లేకుండా చేస్తుంది. మూత్ర విసర్జనలో ఇన్ఫెక్షన్లకు చికిత్స చేస్తుంది. రక్తహీనత సమస్యను తగ్గించటానికి కొబ్బరిలో ఐరన్ సమృద్దిగా ఉంటుంది. చిన్న కొబ్బరి ముక్క తింటే చాలు. అతిగా తింటే ఏదైనా అనర్ధమే కదా…లిమిట్ గా తీసుకొని ఇప్పుడు చెప్పిన ఆరోగ్య ప్రయోజనాలను పొందండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.