Healthhealth tips in telugu

15 రోజులు – అరస్పూన్ నీటిలో కలిపి తాగితే Joint Pains,కీళ్ల మధ్య శబ్ధం తగ్గి జిగురు పెరుగుతుంది

Joint Pains : మారిన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటి అనేక కారణాలతో ఎన్నో రకాల సమస్యలు వచ్చేస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా అధిక బరువు, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఎముకల మధ్య జిగురు తగ్గిపోవటం, కీళ్ళు అరిగిపోవటం వంటి ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. కీళ్ల నొప్పులు ఎక్కువ అయినప్పుడు ఎముకల నుండి శబ్దాలు.కూడా వస్తుంటాయి.
Joint pains in telugu
అలాగే మోకాళ్ళ కీళ్ళు అరిగిపోవడం వల్ల ఎముకలు రాపిడికి గురై విపరీతంగా నొప్పి కలుగుతుంది. ఈ సమస్యలకు చెక్ పెట్టడానికి ఇప్పుడు చెప్పే ఈ పొడి చాలా బాగా సహాయపడుతుంది. శొంఠి,మెంతులు,వాము మూడు సమాన బాగాలుగా తీసుకొని మెత్తని పొడిగా చేసుకోవాలి. ప్రతి రోజు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అరస్పూన్ పొడి కలిపి తాగాలి.
fenugreek seeds
ఈ విధంగా 15 రోజులు తాగితే కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు తగ్గటమే కాకుండా కీళ్ల మధ్య జిగురు పెరిగి టక్ టక్ అనే సౌండ్ కూడా తగ్గుతుంది. అంతేకాక ఈ డ్రింక్ తాగటం వలన అధిక బరువు సమస్య కూడా తగ్గుతుంది. ఈ మూడు కూడా మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి.

కాస్త ఓపికగా శ్రద్ద పెడితే సరిపోతుంది. జీర్ణక్రియ బాగా సాగేలా చేసి గ్యాస్,కడుపు ఉబ్బరం,మలబద్దకం వంటి సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. అలాగే ఖనిజాలు, లవణాలు శరీరానికి అందేలా చేస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.