Beauty Tips

Blackheads removal tips:ఇలా చేస్తే చాలు కేవలం 5 నిమిషాల్లో బ్లాక్ హెడ్స్ శాశ్వతంగా మాయం అవుతాయి

Remove Black Heads : ముక్కు భాగంలో కొన్నిసార్లు బ్లాక్ హెడ్స్ లాంటివి వస్తుంటాయి. వాటిని గోరుతో లాగడం, గిల్లడం లాంటి పనులు చేస్తూ ఉంటారు. మరికొన్ని సార్లు హెడ్స్ రాకుండా అక్కడే ఉండిపోతాయి. వీటిని సులువుగా తగ్గించి మళ్ళీ రాకుండా చేయటానికి మంచి ఇంటి చిట్కా ఉంది. దీని కోసం ఖరీదైన క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు.

ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఒక బౌల్ లో ఒక స్పూన్ శనగపిండి వేసి దానిలో రోజ్ వాటర్ వేసి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని ముక్కు భాగంలో బ్లాక్ హెడ్ ఉన్న ప్రదేశంలో రాసి స్క్రబ్ చేయాలి. ఆ తర్వాత 5 నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు చేస్తే మూడు రోజుల్లో బ్లాక్ హెడ్స్ అనేవి తొలగిపోతాయి.

వీపు మీద వచ్చిన నల్ల మచ్చలు, హెడ్స్ కి కూడా ఇలా చేస్తే తగ్గుతాయి. ఈ పేస్ట్ బాగా పనిచేస్తుంది. శనగపిండిని పురాతన కాలం నుండి చర్మ సంరక్షణలో వాడుతున్నారు. చర్మం మీద మృత కణాలను తొలగిస్తుంది. రోజ్ వాటర్ లో ఉన్న లక్షణాలు కూడా బ్లాక్ హెడ్స్ తొలగించటానికి చాలా బాగా పనిచేస్తుంది.

కాస్త ఓపికగా చేసుకుంటే చాలా తక్కువ ఖర్చుతో బ్లాక్ హెడ్స్ ని తగ్గించుకోవచ్చు. శనగపిండి చర్మంపై ఉన్న నలుపును కూడా తగ్గిస్తుంది. శనగపిండి,రోజ్ వాటర్ సులభంగానే అందుబాటులో ఉంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.