అరుదైన ఆకు…దొరికితే వాడకుండా అసలు వదలద్దు…ఎన్నో ప్రయోజనాలు
Kale Leaves : క్యాబేజీ కుటుంబానికి చెందిన కాలే ఆకులో ఉండే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దృష్ట్యా సూపర్ ఫుడ్ గా ఆహార నిపుణులు చెబుతున్నారు. కాలే ఆకును కూరల్లో కొత్తిమీర లాగా చల్లుకోవచ్చు.సలాడ్స్ లో, జ్యుసుల్లో వేసుకోవచ్చు.ఆకు కూర లాగా వండుకుని తినవచ్చు. సాండ్ విచ్ లో కలుపుకొని తినవచ్చు.
శరీరంలో బలమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి కణజాలంలో ఉండే డిఎన్ఎ డ్యామేజ్ కాకుండా రక్షిస్తుంది. కాలే ఆకులో ఫైబర్, విటమిన్ b6, విటమిన్ సి మరియు పొటాషియం సమృద్దిగా ఉండుట వలన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించటమే కాకుండా రక్తప్రసరణ బాగా జరిగేలా చేసి గుండెకు సంబందించిన సమస్యలు ఏమి లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
విటమిన్ A సమృద్దిగా ఉండుట వలన కంటికి సంబందించిన సమస్యలు లేకుండా కంటి చూపు మెరుగుదలకు సహాయపడుతుంది. విటమిన్ K సమృద్దిగా ఉండుట వలన ఎముకల పటుత్వాన్ని పెంచడం, ఎముక మాతృక ప్రోటీన్లను క్రమబద్దీకరించడం, మెరుగైన కాల్షియం శోషణలో సహాయం చేసి కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులను తగ్గిస్తుంది.
డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. కాలేలోని ఆల్ఫా-లిపోఇక్ ఆమ్లం గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడమే కాకుండా, నరాల నష్టాన్ని కూడా తగ్గిస్తుంది , క్రమంగా ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. కాలే ఆకులు ఖర్చు ఎక్కువ అయినప్పటకి అనేక లాభాలు కలుగుతాయి. దీనిని తీసుకోవడం వలన మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణ ప్రక్రియ బాగా సాగి మలబద్దకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. అయితే కాలే ఆకులను అధిక మోతాదులో తీసుకోకూడదు, దీనిలో ఉండే రఫ్నోజ్ అనే కార్బోహైడ్రేట్ జీర్ణక్రియల సమయంలో అంత తేలికగా కరగడం జరగదు. కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేసి, తినాలనే కోరికను తగ్గిస్తుంది. దాంతో బరువు తగ్గుతారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/