Lychee:రోజుకి 2 తింటే రోగ నిరోధకశక్తి పెరగటమే కాకుండా చెడు కొలెస్ట్రాల్,రక్తహీనత అనేవి అసలు ఉండవు
Lychee Health Benefits :లిచీ పండ్ల గురించి చాలా మందికి తెలియదు. వీటిని తీసుకోవడం వల్ల లాభాలు చాలా ఎక్కువగా ఉంటాయి. లిచీ పండ్లు ఎన్నో పోషకాలతో నిండి ఉంటుంది. ఈ పండ్లలో విటమిన్స్, ఖనిజాలకి గొప్ప మూలమని చెప్పొచ్చు. వీటిలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, లిపిడ్స్, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, విటమిన్ సి వంటి అనేక పోషకాలు ఉన్నాయి.
లిచీ పండు ఒకప్పుడు చాలా అరుదుగా లభించేది. ఇప్పుడు చాలా విరివిగానే లభిస్తుంది. లిచీ పండును తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పండులో విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే తెల్ల రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరచటమే కాకుండా పనితీరులో కూడా సహాయపడుతుంది. ఆక్సీకరణ నష్టాన్ని తొలగిస్తుంది.
లిచీలో ఉండే నియాసిన్ మంచి HDL కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. రక్తంలో హానికరమైన ట్రైగ్లిజరైడ్స్ మరియు చెడు LDL కొలెస్ట్రాల్ మొత్తాన్ని తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిసుంది. డైటరీ ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి గ్యాస్,కడుపు ఉబ్బరం,మలబద్దకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. అంతేకాకుండా బరువు తగ్గించటానికి సహాయపడుతుంది.
లిచీ పండ్లలో తగినంత పొటాషియం మరియు నీరు ఉండటం వలన కండరాల బలాన్ని పెంచటమే కాకుండా కండరాల తిమ్మిరిని తగ్గిస్తుంది. శరీరాన్ని హైడ్రేడ్ గా ఉంచుతుంది. కాలేయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు కూడా ఈ పండ్లను తినవచ్చు. లిచీ పండ్లలో ఉండే కొన్ని శక్తివంతమైన బయోయాక్టివ్ స్ఫటికాకార ఆల్కలాయిడ్స్ నిజానికి పిండి పదార్ధాన్ని చక్కెరగా మార్చడాన్ని నిలిపివేస్తాయి.
దాంతో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది, మాంగనీస్, మెగ్నీషియం, రాగి, ఇనుము మరియు ఫోలేట్ ఉండుట వలన రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ