Joint Pains:కీళ్ల నొప్పులు,కండరాల నొప్పులు,నడుము నొప్పి,వీపు నొప్పి ఇలా అన్నీ రకాల నొప్పులు తగ్గుతాయి
Joint Pains Home Remedies : వయస్సుతో సంబందం లేకుండా ఈ రోజుల్లో చాలా చిన్న వయస్సులోనే చాలా రకాల సమస్యలు వచ్చేస్తున్నాయి. సమస్యలను తగ్గించుకోవటానికి ముందుగా ఇంటి చిట్కాలను ఫాలో అవ్వవచ్చు. ఒకప్పుడు 60 సంవత్సరాల వయస్సులో వచ్చే కీళ్ల నొప్పులు ఇప్పుడు 30 ఏళ్లకే వచ్చేస్తున్నాయి. నొప్పులు వచ్చాయంటే నాలుగు అడుగులు వేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది.
ఇటువంటి నొప్పులను తగ్గించుకోవటానికి ఇప్పుడు ఒక నూనె తయారీ గురించి తెలుసుకుందాం. పొయ్యి మీద పాన్ పెట్టి 50 ఎంఎల్ ఆవనూనె పోసి దానిలో 5 లేదా 6 బిరియాని ఆకులను ముక్కలుగా కట్ చేసి వేసి ఆకు బాగా వేగే వరకు వేగించాలి. బాగా వేగాక ఆ నూనెను వడకట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి.
ఈ నూనెను నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి సున్నితంగా మసాజ్ చేస్తే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. శరీరంలో వచ్చే అన్నీ రకాల నొప్పులను తగ్గించటంలో ఈ నూనె చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఆవనూనె నొప్పులను తగ్గించటానికి పురాతన కాలం నుండి వాడుతున్నారు. ఆవనూనె చర్మం లోపలకు చొచ్చుకొని పోయి నొప్పులను తగ్గిస్తుంది.
బిరియాని ఆకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన నొప్పుల నుండి ఉపశమనం కొరకు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ నూనెను ఒకసారి తయారుచేసుకుంటే దాదాపుగా పదిహేను రోజుల వరకు వాడుకోవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.