అరస్పూన్ పొడి ఎముకల బలహీనత, కండరాల నొప్పులు,నరాల్లో అడ్డంకులు,కాల్షియం లోపం వంటివి లేకుండా చేస్తుంది
Joint Pains Home Remedies : ఈ మధ్య కాలంలో చాలా మంది కాల్షియం లోపంతో బాధపడుతున్నారు. కాల్షియం లోపం కారణంగా కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు, అలసట, నీరసం,కండరాల నొప్పులు,ఎముకలు బలహీనంగా మారటం వంటి సమస్యలు వస్తాయి. అలాగే 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు చెప్పే పొడిని తీసుకుంటే మంచి ఫలితం వస్తుంది.
ఈ పొడిని తయారుచేసుకోవటానికి ఒక కప్పు అవిసె గింజలు, అరకప్పు తెల్ల నువ్వులు, ఒక కప్పు వాల్ నట్స్ తీసుకొని వేగించి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని ప్రతి రోజు ఉదయం లేదా రాత్రి పడుకోవటానికి అరగంట ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలల్లో అరస్పూన్ కలిపి తాగాలి. ఇలా తాగితే అన్నీ రకాల నొప్పులు తగ్గుతాయి.
నిద్రలేమి సమస్య ఉన్నవారు రాత్రి సమయంలో తాగితే మంచిది. కీళ్లనొప్పులు,శారీరక బలహీనత వంటి సమస్యలు ఉన్నవారు ఉదయం సమయంలో తాగితే మంచిది. ఉదయం సమయంలో తాగటం వలన అలసట,నీరసం,నిస్సత్తువ లేకుండా హుషారుగా ఉంటారు. వయస్సు పెరిగేకొద్ది వచ్చే ఎముకలకు సంబందించి సమస్యలు కూడా ఉండవు.
ఒకప్పుడు నొప్పులు అయినా ఎటువంటి సమస్యలు అయినా 50 ఏళ్ళు దాటాక వచ్చేవి. కానీ ఇప్పటి పరిస్థితిలో 30 ఏళ్ళు వచ్చేసరికి ఏదో ఒక సమస్య వస్తోంది. ఇలా రాకుండా ఉండాలంటే ఇటువంటి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.