వేసవిలో ఈ టీ తాగితే శరీరంలో వేడి తగ్గి డీహైడ్రేషన్ బారిన పడకుండా శరీరం రిఫ్రెష్ అవుతుంది
Summer Energy drink : వేసవికాలం ప్రారంభం అయిపోయింది. ఇక ఈ ఎండలను తట్టుకోవటానికి కొన్ని రకాల ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి. ఇప్పుడు ఒక టీ గురించి తెలుసుకుందాం. ఈ టీ తాగితే శరీరంలో వేడి తగ్గి డీహైడ్రేషన్ బారిన పడకుండా శరీరంను రిఫ్రెష్ చేస్తుంది. అలాగే ఈ టీ ఉదయం సమయంలో కాఫీ లేదా టీలకు బదులుగా తాగితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
ఒక గిన్నెలో రెండు కప్పుల నీటిని పోసి బాగా మరిగించి రెండు గ్రీన్ టీ బాగ్స్, పది పుదీనా ఆకులు, రెండు స్పూన్ల కీరా దోశ తురుము వేసి బాగా కలిపి పొయ్యి ఆఫ్ చేసి మూత పెట్టి 15 నిమిషాలు అలా వదిలేయలి. ఆ తర్వాత ఈ నీటిని వడకట్టి ఒక స్పూన్ తేనె కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. చల్లగా తాగాలని అనుకుంటే చల్లారాక ఐస్ క్యూబ్ లు వేసుకొని తాగాలి.
ఈ టీ తాగటం వలన జీర్ణ సమస్యలు అయిన గ్యాస్,కడుపు ఉబ్బరం,మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి బలపడి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ లేకుండా చేస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ ని తగ్గించి రక్తప్రసరణ బాగా జరిగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.
వేసవిలో తొందరగా అలసట,నిస్సత్తువ వచ్చేస్తాయి. అటువంటి సమస్య ఉన్నప్పుడూ ఈ టీ తాగితే తక్షణ శక్తి లభిస్తుంది. కాబట్టి ఈ వేసవిలో ఈ టీని అసలు మిస్ చేసుకోకండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.