1 సారి ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గటమే కాకుండా జుట్టు చివర్లు చిట్లటం కూడా తగ్గుతుంది
Hair Fall Tips : ఈ రోజుల్లో మనలో చాలా మంది జుట్టు రాలే సమస్యతో పాటు జుట్టు చివర్లు చిట్లటం వంటి సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందులను తొలగించటానికి ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. జుట్టు సమస్యలకు పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు.
అరకప్పు పచ్చి కొబ్బరిని,ఒక కప్పు నీటిని పోసి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా చేసి వడకట్టి పాలను తయారుచేసుకోవాలి. ఆ తర్వాత బాగా పండిన అరటిపండును ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసి కొంచెం నీటిని పోసి మిక్సీ చేయాలి. కొబ్బరి పాలల్లో మిక్సీ చేసిన అరటి పండు పేస్ట్ ని వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి పావుగంట అలా వదిలేయాలి. ఆ తర్వాత రెగ్యులర్ గా వాడే షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది. అరటి పండు,కొబ్బరి పాలల్లో ఉన్న పోషకాలు జుట్టు రాలకుండా జుట్టు ఒత్తుగా పెరగటానికి చాలా బాగా సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/