మెడ,చేతులు,ముఖంపై ఉన్న నలుపును తొలగించే జపనీస్ సీక్రెట్…చర్మాన్ని తెల్లగా మారుస్తుంది
Dark skin Removal Tips : ఎండాకాలంలో మెడ,చేతులు,ముఖం మీద చెమట,మురికి పెరుకుపోయి నల్లగా మారుతుంది. నల్లగా మారిన మెడను తెల్లగా మార్చుకోవటానికి ఒక మంచి ఇంటి చిట్కా తెలుసుకుందాం. దీని కోసం సగ్గుబియ్యాన్ని పొడిగా తయారుచేసుకోవాలి. సగ్గుబియ్యంలో పినోలిక్ యాసిడ్ సమృద్దిగా ఉండుట వలన కొత్త కణాల ఏర్పాటుకు సహాయపడుతుంది.
ఒక బౌల్ లో ఒక స్పూన్ సగ్గుబియ్యం పొడి, ఒక స్పూన్ శనగపిండి,ఒక స్పూన్ టమోటా రసం,ఒక స్పూన్ కాఫీ పొడి,ఒక స్పూన్ పెరుగు వేసి బాగా కలపాలి. అవసరం అయితే కొంచెం నీళ్ళను కలపవచ్చు. ఈ పేస్ట్ ని నల్లగా ఉన్న మెడ లేదా చేతులు లేదా ముఖం మీద రాసి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
టమోటా చర్మం మీద ఉన్న మృతకణాలు, నలుపును తగ్గిస్తుంది. శనగపిండి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. పెరుగు చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. కాఫీ పొడి చర్మం మీద ఉన్న జిడ్డును తొలగించటమే కాకుండా పోషణ అందిస్తుంది. వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తే మంచి ఫలితం వస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/