Healthhealth tips in telugu

వేసవిలో నీరసం,అలసట,నిస్సత్తువ తగ్గించి రోగ నిరోధకశక్తిని పెంచే టీ

summer drinks : ఈ వేసవిలో శరీరంలో వేడిని తగ్గించి అలసట,నీరసం,నిస్సత్తువ లేకుండా హుషారుగా ఉండేలా చేసే టీ గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఈ Tea ని తాగితే శరీరంలో రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. పుదీనా Tea తాగితే శరీరంలో రోగ నిరోధకశక్తి పెరగటమే కాకుండా శరీరంలో అలసట,నీరసం వంటివి ఉండవు.
Pudina Health benefits in telugu
పొయ్యి మీద ఒక గ్లాస్ నీటిని పోసి కాస్త వేడి అయ్యాక పది పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి వేసి 5 నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత వడకట్టి కొంచెం నిమ్మరసం,తేనె కలిపి తాగాలి. అయితే డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి. వేసవిలో ఎక్కువగా పొట్టకి సంబందించిన గ్యాస్,కడుపు ఉబ్బరం,మలబద్దకం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి.

ఆ సమస్యలను కూడా తగ్గించటానికి సహాయపడుతుంది. ఎండలో బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఈ పుదీనా Tea తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ టీ ని వేడిగా తాగవచ్చు. అలాగే Ice Cubes వేసుకొని చల్లగా కూడా తాగవచ్చు. రాత్రి సమయంలో ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా నిద్ర పడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.