Hair Fall Tips:వారానికి 1 సారి రాస్తే జుట్టు చాలా వేగంగా పెరుగుతుంది…సీక్రెట్ ప్యాక్
Hair Fall Tips In Telugu :ఏ సీజన్ లో అయినా జుట్టుకి సంబందించిన సమస్యలు వస్తే ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. కాస్త ఓపికగా చేస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సులభంగా బయట పడవచ్చు.
చెమట కారణంగా తలలో జిడ్డు,పొడిగా మారటం,జుట్టు రాలిపోవటం వంటి అనేక రకాల సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు తగ్గించుకోవటానికి అలాగే సమస్యలు రాకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పే ప్యాక్ చాలా బాగా సహాయపడుతుంది. ఈ చిట్కా చాలా సులభంగా చేసుకోవచ్చు.
అరకప్పు పెరుగులో ఒక Egg వేసి బాగా కలిపి జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి అరగంట అలా వదిలేయాలి. ఆ తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తూ ఉంటే వేసవిలో వచ్చే జుట్టు సమస్యలు అన్నీ తొలగిపోతాయి. పెరుగులో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రు లేకుండా చేస్తాయి.
పెరుగులో ఉండే ప్రోటీన్ జుట్టుకి కండిషనింగ్ చేస్తుంది. కళావిహినంగా మారిన జుట్టును మృదువుగా చేస్తుంది. పెరుగులో ఉండే బయోటిన్ జుట్టు రాలకుండా జుట్టు పెరిగేలా చేస్తుంది. Egg లో ఉండే ప్రోటీన్ జుట్టు మృదువుగా ఉండేలా చేస్తుంది. Egg లో ఉండే పోషకాలు జుట్టు ఎదుగుదలకు సహాయపడతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.chaipakodi.com/