ఈ సమస్యలు ఉన్నవారు సపోటా తింటే ఏమి అవుతుందో తెలుసా ?
Sapota health benefits : సపోటాలో ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సపోటాని కొన్ని సమస్యలు ఉన్నవారు తినకుండా ఉంటేనే మంచిది. సపోటా తిన్నప్పుడు కొంతమందికి గొంతులో దురద వస్తుంది. అలాంటి వారు సపోటా పండుకి దూరంగా ఉంటేనే మంచిది. అలాగే డయాబెటిస్ ఉన్నవారు కూడా ఎక్కువగా సపోటా తినకూడదు.
చిన్న పిల్లల్లో శ్వాస సంబంద సమస్యలు ఉన్నవారికి సపోటా పెట్టకపోవటం చాలా మంచిది. అలాగే రోజు రెండు సపోటా పండులను మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సంబంద సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జీర్ణ సంబంద సమస్యలు ఉన్నవారు సపోటా తినే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.
సపోటాలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా శరీరాన్ని కాపాడు తుంది. శరీరంలో అలసట,నిస్సత్తువ వంటివి లేకుండా చేస్తుంది. కంటికి సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. సపోటా యాంటీ ఇన్ ఫ్లమేటరీ ఏజెంట్ గా పనిచేసి నొప్పులు,వాపుల నుండి ఉపశమనం కలిగేలా చేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/