ఇలా చేస్తే రక్తనాళాల్లో బ్లాక్, నరాల వాపు,నరాల నొప్పులు,బలహీనత అన్నీ మాయం అవుతాయి
Blood vessels blockage : ఈ రోజుల్లో మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, గుండెల్లో రక్తం వెళ్ళే రక్తనాళాలు బ్లాక్ అవ్వడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమస్యలు ఉన్నప్పుడూ డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే ఫలితం చాలా తొందరగా వస్తుంది. ఈ చిట్కా కోసం ఉపయోగించే ఇంగ్రిడియన్స్ మనకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవే.
ఒక కప్పు అవిసే గింజలు, ఒక కప్పు నువ్వులను పాన్ లో వేసి దోరగా వేగించి మిక్సీలో వేసుకొని మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడి దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. రాత్రి పడుకోవటానికి ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలల్లో ఒక స్పూన్ పొడిని కలిపి తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది.
అవిసే గింజలలో ఉండే లక్షణాలు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించటానికి చాలా బాగా సహాయపడి రక్తనాళాల్లో ఉండే కొవ్వును కరిగించి ఎటువంటి బ్లాకేజ్ లేకుండా రక్తప్రవాహం బాగా సాగేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలాగే డయాబెటిస్ ఉన్న వారికి కూడా చాలా మంచిది. డయాబెటిస్ ఉన్నవారిలో వచ్చే నరాల బలహీనతను కూడా తగ్గిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.