Healthhealth tips in telugu

ఈ పేస్ట్ రాస్తే చాలు చర్మంపై వచ్చే దురద,తామర,గజ్జి,ఇన్ ఫెక్షన్ వంటివి అన్నీ మాయం అవుతాయి

Fungal Infection Home Remedies : కాకరకాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్నో చర్మ సమస్యలను తగ్గించటానికి కాకరకాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. గజ్జి,తామర వంటివి వచ్చాయంటే తొందరగా తగ్గవు. అటువంటి అన్నీ రకాల చర్మ సమస్యలను తగ్గించటంలో కాకరకాయ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

కాకరకాయను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. చిన్న కప్పు కాకరకాయ ముక్కలను మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఒక కర్పూరం బిళ్ళను పొడిగా చేసి వేయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న ప్రదేశంలో రాసి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ఉదయం,సాయంత్రం చేస్తూ ఉంటే తొందరగానే మంచి ఫలితం వస్తుంది. ఈ పేస్ట్ ని ముఖానికి రాస్తే మొటిమలు,మొటిమల కారణంగా వచ్చే మచ్చలను కూడా తగ్గిస్తుంది. ఈ పేస్ట్ ని ఫ్రిజ్ లో పెడితే నాలుగు రోజుల వరకు వాడుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.