Get Rid of Dandruff: శాశ్వతంగా చుండ్రు సమస్య తగ్గాలంటే ..
Get Rid of Dandruff: శాశ్వతంగా చుండ్రు సమస్య తగ్గాలంటే .. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే జుట్టు సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులోనూ చుండ్రు సమస్యలతో మరింత బాధ పడుతున్నారు.
ఈ చుండ్రు భుజాలపై, ముఖంపై పడి ఇబ్బంది పడుతుంది. చుండ్రుతో పింపుల్స్ సమస్య కూడా అధికమవుతుంది. దీంతో నలుగురిలో తిరగాలన్నా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ సమస్య నుంచి బయట పడటానికి రకరకాల షాంపూలు, నూనెలు ఉపయోగించే ఉంటారు.
అయితే ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్‌గా ఈ సమస్యల నుంచి బయట పడొచ్చుచుండ్రు సమస్య అనేది తొందరగా తగ్గదు. మనలో చాలా మంది చుండ్రు సమస్య వచ్చినప్పుడు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి విసుగు చెంది ఉంటారు. అలాంటి వారు ఈ చిట్కా ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది. మార్కెట్ లో దొరికే ఎటువంటి ప్రొడక్ట్స్ వాడవలసిన అవసరం లేదు.
ఒక బౌల్ లో నాలుగు స్పూన్ల పెరుగు, అరచెక్క నిమ్మరసం,ఒక స్పూన్ ఆవనూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు…అలాగే తల మాడుకు బాగా పట్టించి అరగంట తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే క్రమంగా చుండ్రు సమస్య తగ్గుతుంది.
పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం, నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్, ఆవనూనెలో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు తల మీద చుండ్రు లేకుండా చేయటానికి బాగా సహాయపడతాయి. అలాగే తల మీద చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండేలా కెఃస్తుంది. ఈ చిట్కా కోసం ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ మనకు సులువుగానే లభ్యం అవుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ