1 గ్లాస్ తాగితే ఎండల దెబ్బకు తల తిరగటం,తలనొప్పి,అలసట,నీరసం అసలు ఉండవు
summer drink : ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఈ ఎండలకు మనం జాగ్రత్తగా లేకపోతే ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఎండాకాలంలో ప్రతి రోజు ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే తల తిరగటం,తలనొప్పి,అలసట,నీరసం వంటివి లేకుండా హుషారుగా ఉంటారు. ఎండ వేడికి చాలా మంది ఏ పని చేయలేరు. చాలా అలసటగా ఉంటారు.
ఈ డ్రింక్ తయారీ కోసం స్పూన్ సబ్జా గింజలను నీటిని పోసి గంట నానబెడితే అవి బాగా ఉబ్బి జెల్లీ మాదిరిగా తయారవుతాయి. ఒక బౌల్ లో అరకప్పు పుచ్చకాయ ముక్కలు, పావు కప్పు దానిమ్మ గింజలు, పావుకప్పు ఫైనాఫిల్ ముక్కలు,నానబెట్టిన సబ్జా గింజలు,ఒక స్పూన్ పటికబెల్లం పొడి,చిటికెడు నల్ల ఉప్పు,ఒక కాయ నిమ్మరసం, కొన్ని పుదీనా ఆకులు వేయాలి.
చివరగా బాగా చల్లగా ఉన్న నీటిని నాలుగు గ్లాసులు పోయాలి. ఇలా అన్నీ వేశాక బాగా కలిపి అరగంట సేపు అలా వదిలేయలి. ఆతర్వాత ఒక గ్లాస్ తాగాలి. ఇప్పుడు తయారుచేసుకున్న డ్రింక్ నలుగురికి సరిపోతుంది. వీటిలో అన్నీ రకాల పండ్లను వేయటం వలన ఈ వేసవిలో వచ్చే సమస్యలను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది.
ముఖ్యంగా తల తిరగటం,డీ హైడ్రేషన్,తలనొప్పి,అలసట,నీరసం వంటివి అన్నీ తొలగిపోతాయి. ఈ డ్రింక్ తాగితే ఉత్సాహంగా హుషారుగా ఉంటారు. ఈ ఎండాకాలంలో వచ్చే వడదెబ్బ కూడా ఉండదు. రోజులో ఒకసారి తాగితే సరిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.