1 గ్లాసు శరీరంలో కొవ్వును కరిగించి అధిక బరువును తగ్గించటమే కాకుండా వేడిని కూడా తగ్గిస్తుంది
weight Loss Drink in Telugu : అధిక బరువు సమస్య అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినపడుతుంది. వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. బరువు అనేది ఆరోగ్యకరమైన రీతిలో తగ్గాలి. ఒక్కసారిగా బరువు తగ్గిపోకూడదు. మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడవలసిన అవసరం లేదు.
నల్ల జీలకర్ర,మెంతులు రెండు సమాన పరిమాణంలో తీసుకొని పాన్ లో వేసి వేగించి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడి దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ప్రతి రోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అరస్పూన్ పొడి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఒక స్పూన్ నిమ్మరసం కలపాలి.
ఈ డ్రింక్ ని పది రోజుల పాటు తీసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది. మెంతులు తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి కొవ్వుగా మారకుండా శక్తిగా మారేలా చేస్తుంది. ఈ డ్రింక్ తాగటం వలన డయాబెటిస్ కూడా నియంత్రణలో ఉంటుంది. ఈ డ్రింక్ తీసుకుంటూ ప్రతి రోజు అరగంట వ్యాయామం లేదా యోగా తప్పనిసరిగా చేయాలి.
ఎప్పుడైనా మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ కన్నా మన ఇంటిలో సహజసిద్దంగా దొరికే వస్తువులతో ఇలా చేస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించుకొని ఆదిక బరువు సమస్య నుండి బయట పడవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.