10 నిమిషాల్లో ప్రోటీన్ పౌడర్ ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.. ఎలా అంటే…
Best homemade protein powder : చాలా ఆరోగ్యకరమైన ప్రోటీన్ పౌడర్ ని ఇంటిలో చాలా సులభంగా కేవలం 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ప్రోటీన్ అనేది ఒక ముఖ్యమైన స్థూల పోషకం, ఇది కణజాలాన్ని సరిచేయడానికి, ఎంజైమ్లు మరియు హార్మోన్లను నిర్మించడంలో సహాయపడుతుంది.
కండరాలను నిర్మించడం మరియు టోన్ చేయడం మరియు కణజాలాన్ని బలోపేతం చేయడం, మరమ్మత్తు చేయడం లేదా భర్తీ చేయడం వంటి వాటికి ప్రోటీన్ చాలా అవసరం. ఇది బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. ఈ పొడిని తయారుచేసుకోవటం చాలా సులువు. ఈ పొడి దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది.
బాదం పప్పు పావు కప్పు, పిస్తా పప్పు పావుకప్పు, వాల్ నట్స్ పావుకప్పు,వేరుశెనగలు పావుకప్పు,సోయా బీన్స్ పావుకప్పు, గుమ్మడికాయ గింజలు పావుకప్పు,అవిసె గింజలు పావుకప్పు,చియా విత్తనాలు పావుకప్పు, ఓట్స్ పావు కప్పు,మిల్క్ పౌడర్ పావుకప్పు అవసరం అవుతాయి. వీటిని సిడమ్ చేసుకోవాలి.
పొయ్యి మీద పాన్ పెట్టి బాదంపప్పులు, పిస్తాపప్పులు, వాల్ నట్స్ మరియు వేరుశెనగలను వేసి వేగించాలి. ఆ తర్వాత అవిసె గింజలను వేగించాలి. ఆ తర్వాత గుమ్మడి గింజలు, చియా గింజలు, సోయాబీన్స్ మరియు ఓట్స్లను వేసి వేగించాలి. వేగించిన ఈ గింజలను మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా మిక్సీ చేయాలి. ఆ తర్వాత మిల్క్ పౌడర్ ని వేసి మరోసారి మిక్సీ చేయాలి.
ఈ పొడిని జల్లెడ సాయంతో జల్లించి నిల్వ చేసుకోవాలి. ప్రతి రోజు ఒక స్పూన్ పొడిని పాలల్లో కలిపి తీసుకోవచ్చు. కండరాల పెరుగుదలకు అవసరమైన ప్రోటీన్ సంశ్లేషణను ప్రేరేపిస్తుంది. వ్యాయామం తర్వాత కండరాల నొప్పి నుండి త్వరగా కోలుకోవడానికి ప్రోటీన్ పౌడర్ సహాయ పడుతుంది. రక్తపోటు,డయాబెటిస్ నియంత్రణలో సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.