Healthhealth tips in telugu

రాత్రి పడుకొనే ముందు ఈ పాలను తాగితే ఊహించని ప్రయోజనాలు ఎన్నో…అసలు నమ్మలేరు

Almond Milk benefits In Telugu : సాదరణంగా రాత్రి పడుకొనే ముందు తీసుకొనే ఆహారం మన జీవక్రియలు మరియు రోగ నిరోధకశక్తి మీద ప్రభావం చూపుతుంది. ప్రతి మనిషికి రోజుకి 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. మంచి నిద్ర మరియు మంచి పోషకాలు ఉన్న ఆహారం మన ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి ఆ రెండింటినీ అసలు విస్మరించకూడదు.
Diabetes patients eat almonds In Telugu
ఇప్పుడు మంచి నిద్ర కోసం,శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం కావటానికి మరియు బరువు తగ్గటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేసే ఒక డ్రింక్ గురించి తెలుసుకుందాం. బాదం పాలను రాత్రి పడుకోవటానికి ముందు తాగితే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఒక మిక్సీ జార్ లో వేగించిన 7 బాదం పప్పులు,ఒక స్పూన్ బెల్లం పొడి లేదా ఒక స్పూన్ తేనె వేసి మెత్తగా చేసుకోవాలి.

ఈ పొడిని ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో కలిపి తాగాలి. ఈ విధంగా తాగటం వలన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే విటమిన్ E సమృద్దిగా ఉండుట వలన మెదడు ఆరోగ్యంగా ఉండేలా చేయటమే కాకుండా వయస్సు పెరిగే కొద్ది వచ్చే అల్జీమర్స్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. కాల్షియం సమృద్దిగా ఉండుట వలన ఎముకలకు సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది.

పొటాషియం సమృద్దిగా ఉండుట వలన రక్తపోటు నియంత్రణలో ఉండటమే కాకుండా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అంతేకాకుండా కిడ్నీకి సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేసి కిడ్నీల ఆరోగ్యానికి సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.