Healthhealth tips in telugu

Flax Seeds:పెరుగులో ఈ పొడి కలిపి తింటే కీళ్ల నొప్పులు, కీళ్ల మధ్య శబ్దం తగ్గి కీళ్ల మధ్య గుజ్జు పెరుగుతుంది

Joint Pains Home remedies in telugu : ఈ బిజీ లైఫ్ స్టైల్‌లో చాలా మంది ఆరోగ్యం పట్ల శ్రద్ద పెట్టటం లేదు. వ్యాయామం చేయకపోవటం మరియు పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవటం, ఎక్కువసేపు కూర్చోవటం వంటి కారణాలతో కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఈ నొప్పులు అనేవి మోకాళ్ళ మధ్య గుజ్జు తగ్గినప్పుడు వస్తాయి.
curd benefits in telugu
అలాగే నొప్పులకు సూచనగా నడిచినప్పుడు కీళ్ల మధ్య శబ్దం వస్తుంది. ఆలా శబ్దం రాగానే జాగ్రత్తలు తీసుకోవాలి. మోకాళ్ళ నొప్పులను తగ్గించుకోవటానికి మంచి రెమిడీ తెలుసుకుందాం. దీని కోసం రెండు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. మొదటగా ఆవిసె గింజలను వేగించి మెత్తని పొడిగా తయారుచేసుకోవాలి.

ఈ పొడి దాదాపుగా 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఒక కప్పు పెరుగులో అరస్పూన్ పొడి కలిపి ప్రతి రోజు తీసుకోవాలి. ఈ విధంగా ప్రతి రోజు తీసుకుంటూ ఉంటే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే కీళ్ల మధ్య శబ్దం తగ్గి కీళ్ల మధ్య గుజ్జు పెరుగుతుంది. కీళ్ల నొప్పులకు కారణం అయిన అధిక బరువును తగ్గించటానికి కూడా సహాయపడుతుంది.
Flax seeds
వయస్సు పెరిగే కొద్ది వచ్చే ఎముకలకు సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. అలాగే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఒక్కసారి ఆవిసె గింజల పొడి తయారుచేసుకుంటే సరిపోతుంది. మార్కెట్ లో ఆవిసె గింజల పొడి లభ్యం అవుతుంది. కానీ మన ఇంటిలో తయారుచేసుకుంటే మంచిది.

ఈ విధంగా తీసుకోవటం వలన మోకాళ్ళ నొప్పులు తగ్గటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలి నియంత్రణలో ఉంటాయి. అలాగే ఉదయం సమయంలో తీసుకుంటే అలసట,నీరసం వంటివి అసలు లేకుండా ఉషారుగా ఉంటారు.

రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తొలగి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా అధిక బరువుతో బాధపడేవారు కూడా మంచి పలితాన్ని పొందుతారు. ఒకప్పుడు చాలా అరుదుగా లభించే అవిసే గింజలు ఇప్పుడు చాలా తక్కువ ధరలో చాలా విరివిగానే లభ్యం అవుతున్నాయి.

మారిన పరిస్థితి కారణంగా మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. అవిసే గింజలు ఒక రకమైన వాసన వస్తాయి. అయినా సరే వీటిని తినటం మానకూడదు. దీనిలో ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా బ్యూటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పెరుగు,అవిసే గింజల మిశ్రమం ప్రతి రోజు తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా యన్నంగా ఉంటుంది.

అలాగే జుట్టు రాలకుండా జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. కాబట్టి ప్రతి రోజు తినలేని వారు రోజు విడిచి రోజు అయినా తినటానికి ప్రయత్నం చేయాలి. అపుడే మంచి పలితాన్ని పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u