మాంసం కంటే బలమైన తక్కువ ఖర్చులో ఎక్కువ బలాన్ని ఇచ్చే వీటి సంగతి తెలిస్తే అసలు వదలరు
pulses Health Benefits In Telugu : మనలో చాలా మంది ప్రోటీన్ శరీరానికి సరిపడా అందటం లేదని…ఏ ఆహారాలు తింటే మంచిదో అని ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా నాన్ వెజ్ తినని వారికి ఈ సమస్య ఎదురు అవుతుంది. మాంసం కంటే బలమైన తక్కువ ఖర్చులో ఎక్కువ బలాన్ని ఇచ్చే పప్పుల గురించి తెలుసుకుందాం. ఇవి మన వంటింటిలో ఉన్నా సరే మనకు వీటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందని తెలియదు.
ఆకుపచ్చని రంగులో ఉండే పెసలలో దాదాపుగా 9 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అరటిపండు కంటే పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కండరాల నిర్మాణం, కండరాల నొప్పులు లేకుండా చేస్తుంది. పచ్చి శనగపప్పులో ప్రోటీన్ మిగతా పప్పులతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల పప్పులో 22 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా మంచిది.
ఎర్ర కందిపప్పులో కూడా ప్రోటీన్ ఉంటుంది.అర కప్పు కందిపప్పులో 9 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇంకా ఐరన్, ఫైబర్, విటమిన్ సి, బి6, బి2, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, జింక్ మరియు మెగ్నీషియం సమృద్దిగా ఉంటాయి. మనలో చాలా మందికి ఈ ఎర్ర కందిపప్పు గురించి తెలియదు. ఈ పప్పుతో పప్పు కూర వంటివి చేసుకోవచ్చు.
మినపప్పు విషయానికి వస్తే అరకప్పు మినపప్పులో 12 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అలాగే ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, మెగ్నీషియం మరియు పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది, శక్తి స్థాయిలను పెంచుతుంది, ఎముకల ఆరోగ్యాన్ని, జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా నాడీ వ్యవస్థ పనితీరు బాగుండేలా చేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.