Cracked heels:పాదాల పగుళ్లు తొలగించాలంటే.. ఇలా చేయాలి..?
cracked heels: పాదాల పగుళ్లు. ఇది కొంతమందికి రెగ్యులర్‌గా, మరికొంతమందికి చలికాలంలో ఎక్కువగా వస్తుంటాయి. ఈ సమస్యని దూరం పాదాల పగుళ్లు తగ్గేందుకు క్రీమ్స్, లోషన్స్, పెడిక్యూర్ చేస్తుంటారు.
అలా కాకుండా ఇంట్లోనే పాదాల పగుళ్లని తగ్గించుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకోండి. వీటి వల్ల పగుళ్లు తగ్గి సమస్య దూరమవుతుంది. అందుకోసం, ఇంట్లోనే మనం ఎలాంటి కొన్ని టిప్స్, పదార్థాలను వాడి సమస్యని దూరం చేసుకోవచ్చు.
పాదాల పగుళ్ల సమస్యతో మనలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. పాదాల పగుళ్లు రావటానికి శరీరంలో తేమ శాతం తగ్గటం, అలాగే విటమిన్లు, మినరల్స్ తక్కువగా ఉండటం, ఎక్కువ సేపు నిలబడి పనిచేయడం, వయసు పైబడడం.. అధిక బరువు, సొరియాసిస్, ఎగ్జిమా, థైరాయిడ్, డయాబెటిస్ వంటివి కారణాలుగా చెప్పవచ్చు.
పాదాల పగుళ్లను తగ్గించుకోవటానికి ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. కేవలం రెండు ఇంగ్రిడియన్స్ ఉపయోగించి పాదాల పగుళ్లను తగ్గించుకోవచ్చు. ఓట్స్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే పాదాల పగుళ్లను తగ్గించటానికి మంచి స్క్రబ్‌గా పనిచేస్తుంది.ఓట్స్ లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలతో పాటు మాయిశ్చరైజింగ్ గుణాలు కూడా ఉంటాయి.
అందువల్ల ఓట్స్ మృత కణాలను తొలిగించి చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. దీని కోసం గోరువెచ్చని నీటిలో పావుగంట పాటు పాదాలను ఉంచాలి. ఆ తర్వాత ఒక స్పూన్ ఓట్స్ పొడిలో సరిపడా ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిపి పాదాలకు అప్లై చేసి స్క్రబ్ చేయాలి. ఆ తర్వాత అరగంట అయ్యాక పాదాలను శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే పాదాల పగుళ్లు క్రమంగా తగ్గుతాయి. కాస్త ఓపికగా చేసుకుంటే ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ప్రతి రోజూ పాదాలకు కూడా ఫుట్ క్రీం లేదా మాయిశ్చరైజర్ వంటివి రాసుకోవాలి. లేదంటే కనీసం పెట్రోలియం జెల్లీ అప్లై చేసినా సరిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ