Beetroot:షుగర్ ఉన్నవాళ్లు బీట్ రూట్ ఎక్కువగా తింటే ఏమి అవుతుందో తెలుసా..?
Beetroot good for diabetes : డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆహారం అనేది డయాబెటిస్ నియంత్రణలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు బీట్ రూట్ తింటే ఏమి అవుతుందో తెలుసుకుందాం. బీట్ రూట్ లో ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
బీట్ రూట్ లో ఉండే ఫైటోకెమికల్స్ గ్లూకోజ్ మరియు ఇన్సులిన్‌పై నియంత్రణ ప్రభావాన్ని చూపుతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన ఫ్రీ రాడికల్స్ తో పోరాటం చేసి శరీరంలో కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే సెల్యులార్ డ్యామేజ్‌ని ఆక్సీకరణ ఒత్తిడి అంటారు.
డయాబెటిస్ కారణంగా వచ్చే రెటినోపతి,కిడ్నీ సమస్యలు,న్యూరోపతి మరియు డయాబెటిక్ ఫుట్ వ్యాధి,గుండెకు సంబందించిన సమస్యలు లేకుండా చేయటంలో బీట్ రూట్ సహాయపడుతుంది. బీట్ రూట్ లో ఉండే నైట్రేట్ అనేది ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది.బీట్ రూట్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఆల్ఫా-లిపోయిక్ యాసిడ్ డయాబెటిస్ ఉన్నవారిలో నరాల నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
బీట్ రూట్ లో ఉండే బెటాలైన్ మరియు నియో బెటానిన్ వంటి పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో మరియు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడతాయి. డయాబెటిస్ వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాలి. అలా మందులు వాడుతూ డయాబెటిస్ నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News