Finger Millets:ఈ జావ తాగితే డయాబెటిస్,రక్తహీనత తగ్గటమే కాకుండా ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి
Finger Millets benefits In telugu : ఒకప్పుడు తృణధాన్యాలను ఎక్కువగా తినేవారు. మరల ఇప్పుడు మారిన పరిస్థితుల కారణంగా మరల వీటి వాడకం చాలా ఎక్కువ అయింది. తృణధాన్యాలలో ఒకటైన రాగులు గురించి ఈ విషయాలను తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. రాగులను పిండిగా చేసుకొని వాడుకోవచ్చు.
రాగి పిండితో రొట్టెలు,జావ వంటివి చేసుకొని తినవచ్చు. వీటిని జావగా తయారుచేసుకొని ప్రతి రోజు తాగితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అధిక బరువు సమస్యతో బాధపడేవారు ప్రతి రోజు తీసుకుంటూ ఉంటే రాగులలో ఉండే ఫైబర్ జీర్ణ సంబంద సమస్యలు ఏమి లేకుండా చేయటమే కాకుండా కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది.
అలాగే తొందరగా ఆకలి లేకుండా చేస్తుంది. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగిస్తుంది. రాగులలో calcium సమృద్దిగా ఉండుట వలన కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. వయస్సు పెరిగే కొద్ది వచ్చే ఎముకలకు సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది.
డయాబెటిస్ ఉన్నవారు ప్రతి రోజు రాగి జావ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. రాగులలో ఉండే ఫైటోకెమికల్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించటానికి సహాయపడతాయి. డయాబెటిస్ ఉన్నవారిలో కొలెస్ట్రాల్ స్థాయిలు తొందరగా పెరుగుతూ ఉంటాయి. అలా పెరగకుండా రాగుల్లో అమైనో యాసిడ్ లెసిథిన్ మరియు మేథినోన్ సహాయపడతాయి.
రాగులలో ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తహీనత సమస్య ఉన్నవారికి మంచి ఆహార ఎంపిక అని చెప్పవచ్చు. రక్తంలో హిమెగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అయితే కిడ్నీ సమస్యలు ఉన్నవారు రాగులను చాలా లిమిట్ గా తీసుకోవాలి. ఎందుకంటే శరీరంలో ఆక్సాలిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.