Beauty Tips

Head Lice:ఇలా ఒక్కసారి చేస్తే నిమిషాల్లో మీ తలలో పేలు అన్నీ మాయం

Lice Home Remedies : పేలు.. ఇవి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకూ తలలోకి చేరి ఇబ్బందిపడతాయి. మరీ ముఖ్యంగా పిల్లల్లో ఎక్కువగా ఈ సమస్య ఉంటుంది. ఇది స్కూల్‌కి వెళ్ళినప్పుడు ఒకరి తల నుంచి మరొకరికి వస్తాయి. తలలో రక్తం తాగుతాయి. దీంతో దురద వంటి సమస్యలొస్తాయి. వీటిని వదిలించుకోవడానికి సహజ పరిష్కారాలు ఏంటో తెలుసుకోండి.

తలలో పేలు ఈలు ఉన్నాయంటే విపరీతమైన దురద వస్తుంది. అలాగే చాలా చికాకుగా ఉంటుంది. పేలను తగ్గించటానికి ఒక మంచి చిట్కా తెలుసుకుందాం. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. పేల సమస్యను తగ్గించడానికి వేప నూనె చాలా బాగా సహాయపడుతుంది. వేప నూనెను పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో వాడుతున్నారు.
lice home remedies
వేప నూనెను కొంచెం తీసుకుని తలకు బాగా పట్టించి ఒక పది నిమిషాల తర్వాత దువ్వెనతో దువ్వితే పేలు అన్ని చనిపోయి రాలిపోతాయి. ఆ తర్వాత షాంపూ లేదా కుంకుడు కాయతో తల రుద్దుకుంటే సరిపోతుంది. వేప నూనెలో నింబిడిన్ అనే క్రియశీల పదార్థం ఉండటం అలాగే యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటం వలన చుండ్రు వంటి సమస్యలు లేకుండా చేస్తుంది.

జుట్టు సంరక్షణకు అవసరమైన పోషకాలు ఎన్నో ఉంటాయి. వేపనూనె మార్కెట్లో లభ్యమవుతుంది లేదా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వేప నూనె జుట్టుకు కండీషనర్ వలె పనిచేస్తుంది. జుట్టు రాలకుండా జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి కూడా సహాయపడుతుంది. జుట్టు సమస్యలకు వేప నూనె మంచి పరిష్కారం అని చెప్పవచ్చు.
neem Leaves
వేప నూనెను మూడు రోజులు రాస్తే పేల సమస్య, చుండ్రు సమస్య తగ్గటమే కాకుండా జుట్టు రాలే సమస్య కూడా తగ్గిపోతుంది. వేపలో ఉండే విటమిన్ E, యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ కణాల పునరుత్పత్తిలో సహాయపడి ఆరోగ్యకరమైన స్కాల్ప్ ను ప్రోత్సహిస్తుంది.
vepa puvvu
వేప నూనె దొరకని వారు వేప ఆకులను శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్ గా చేసి తలకు బాగా పట్టించి గంట తర్వాత తలస్నానం చేయాలి. ఈ విధంగా చేస్తే తలలో పేల సమస్య తొలగిపోతుంది. ఇలా ఇంటి చిట్కాలను పాటిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తలలో పేల సమస్య నుండి బయట పడవచ్చు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ