Healthhealth tips in telugu

Mudi Biyyam:ఈ బియ్యాన్ని ఉడికించి తింటే ఊహించని ప్రయోజనాలు ఎన్నో…తెలిస్తే వదలకుండా తింటారు

Mudi Biyyam Health benefits in telugu : సాధారణంగా మనం తినే అన్నంలో పోషక విలువల గురించి ఆలోచించం. అన్నం అందంగా, తెల్లగా, కనబడుతుందా లేదా అని మాత్రమే ఆలోచిస్తాం. అయితే కంటికి ఇంపుగా అన్నాన్ని తయారుచేస్తే.. అందులో పోషక విలువలు పోతుంటాయి.

ముడిబియ్యం (దంపుడు బియ్యం)తో వండిన అన్నం కంటికి ఇంపుగా ఉండదు. కానీ ఒంటికి మాత్రం కచ్చితంగా మంచిది. బియ్యాన్ని పాలిష్‌ చేసి, ఆకర్షణీయంగా చేసే పద్ధతిలో అందులోని జీవ పదార్థం, ఆరోగ్య రక్షణకి ఎంతగానో అవసరమైన బీ-కాంప్లెక్స్‌ విటమిన్లు పోతున్నాయి.

మనలో చాలా మంది తెల్ల బియ్యాన్ని తినటానికి ఇష్టపడతారు. అదే ముడి బియ్యాన్ని తినటానికి అసలు ఇష్టపడరు. తెల్ల బియ్యంతో పోలిస్తే ముడి బియ్యంలోనే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి రోజు ముడి బియ్యాన్ని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

ముడి బియ్యంలో పీచు సమృద్దిగా ఉండుట వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు. అలాగే ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండుట వలన తీసుకొనే ఆహారం తగ్గుతుంది. దాంతో బరువు తగ్గుతారు. అలాగే పీచు ఉండుట వలన పేగులలో ఆరోగ్యకర కదలికలను ప్రోత్సహించి జీర్ణ సంబంద సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది.
Diabetes In Telugu
అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిల్ని నియంత్రిస్తుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు ప్రతి రోజు ముడి బియ్యం తినటం వలన నీరసం, అలసట వంటివి ఉండవు. డయాబెటిస్ ఉన్నవారిలో తరచుగా నీరసం కనిపిస్తుంది. ఈ బియ్యాన్ని తినటం వలన నీరసం అనేది అసలు ఉండదు. మెగ్నీషియం సమృద్దిగా ఉండుట వలన ఎముకల ఆరోగ్యానికి, క్యాల్షియాన్ని గ్రహించడానికి సహాయపడుతుంది.

అలాగే ఉబ్బసం వచ్చే లక్షణాలను తగ్గిస్తుంది. ముడిబియ్యంలోని సెలీజినయమూ ఉబ్బసానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే అవకాశాలను తగ్గిస్తుంది. మాంగనీస్ సమృద్దిగా ఉండుట వలన నాడీవ్యవస్థ పనితీరు మెరుగుదలకు సహాయపడుతుంది. ముడిబియ్యంలో ఉండే పీచు ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

పీచు సమృద్ధిగా ఉండటం వలన ముడిబియ్యం గుండె జబ్బులు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. రక్తపోటును తగ్గించటంతో పాటుగా ధమనులలో ఫలకం చేరే స్థాయిని తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదం లేకుండా కాపాడుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ప్రతి రోజు ముడి బియ్యాన్ని తినటానికి ప్రయత్నం చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

ముడి బియ్యంలో పీచు సమృద్ధిగా ఉండుట వలన అదనపు కేలరీలు తీసుకోకుండా చూడటమేకాక ఎక్కువ సేపు పొట్ట నిండుగా ఉండేట్లు చేస్తుంది. దీనితో ఎక్కువ ఆహారం తీసుకోలేం. హార్వర్డ్‌ పరిశోధకుల అధ్యయనం మేరకు పీచు ఎక్కువగా ఉండే బియ్యం తినే మహిళల శరీర బరువు సాధారణంగా ఉంటుందని తేలింది. పీచు సమృద్ధిగా ఉన్నందున ముడిబియ్యం ఎంతో సహాయపడుతుంది. ఇది పేగులలో ఆరోగ్యకర కదలికలను ప్రోత్సహించి, మలబద్దకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u