ఈ పువ్వులతో ఇలా చేస్తే సోరియాసిస్,దురద,తామర వంటి చర్మ సమస్యలు మాయం అవుతాయి
psoriasis Home Remedies In telugu : చర్మ సమస్యలు వచ్చాయంటే తొందరగా తగ్గవు. సోరియాసిస్,తామర,దురద వంటి సమస్యలు శరీరంపై ఎక్కడైనా వస్తే మిగతా ప్రదేశాలకు కూడా వ్యాపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే సమయం గడిచే కొద్దీ శరీరం మొత్తం వ్యాపిస్తుంది.
కాబట్టి ఈ సమస్యలను చాలా తొందరగా తగ్గించుకోవాలి.ఈ సమస్య నివారణ కోసం ఒక నూనె ను తయారు చేసుకోవాలి. సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ ని సంప్రదించి సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే నూనెను వాడితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఈ నూనె దాదాపుగా 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది.
ఒక గిన్నెలో 100 గ్రాముల నువ్వుల నూనె,100 గ్రాముల కొబ్బరి నూనె కలిపి పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. ఆ తర్వాత 25 గ్రాముల. వేపాకుల పేస్ట్, 25 గ్రాముల తాజా అలోవెరా జెల్, 50 గ్రాముల బంతి పువ్వులను విడతీసి వేయాలి.మీడియం మంటలో ఏడు నుంచి పది నిమిషాలు మరిగించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారాక చిటికెడు కర్పూరం వేసి బాగా కలపాలి. ఇక ఇప్పుడు ఈ నూనెను వడగట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనె ఎటువంటి చర్మ వ్యాధులను అయిన తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ నూనెను ప్రభావిత ప్రాంతంలో రాసి పది నిమిషాలు అయ్యాక శుభ్రం చేసుకోవాలి.
రాత్రి పడుకొనే ముందు ప్రభావిత ప్రాంతంపై ఈ నూనెను రాసి మరుసటి రోజు శుభ్రం చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే క్రమంగా తగ్గుతాయి చర్మ సమస్యలకు ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. చర్మ సమస్యలు వచ్చినప్పుడు అసలు అశ్రద్ద చేయకూడదు. వేప,ఆలోవెరా చర్మ సమస్యలను తగ్గించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.