వారంలో 2 సార్లు ఈ ఇడ్లీ తింటే అధిక బరువు,డయాబెటిస్ వంటివి అసలు ఉండవు
Jowar Idli Benefits : మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు. ఇప్పుడు జొన్నలతో ఇడ్లీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. జొన్నలను తీసుకోవటం వలన ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండి కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. జీర్ణ సంబంద సమస్యలు ఉండవు. తక్కువ కేలరీలు ఎక్కువ శక్తి లభిస్తుంది.
అధిక బరువు ఉన్నవారికి,డయాబెటిస్ ఉన్నవారికి చాలా మంచి ప్రయోజనం కనపడుతుంది. ఆకుపచ్చని జొన్నలను తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టి సన్నని రవ్వగా మిక్సీ చేసుకోవాలి. ఇడ్లీకి జొన్న రవ్వ బాగా సన్నగా ఉంటేనే(ఇడ్లీ రవ్వ మాదిరిగా) బాగుంటుంది. అప్పుడే ఇడ్లీలు మెత్తగా మృదువుగా వస్తాయి.
ఒక బౌల్ లో ఒక కప్పు మినపగుళ్లు వేసి దానిలో నీటిని పోసి నాలుగు గంటలు నానబెట్టాలి. నానిన మినపగుళ్లను గ్రైండర్ లో వేసి మామూలు ఇడ్లీ పిండి మాదిరిగా కాకుండా కొంచెం పలుచగా రుబ్బుకోవాలి. ఈ పిండిలో మూడు కప్పుల జొన్నరవ్వను వేసి బాగా కలపాలి. సరిపడా ఉప్పు వేసి రెండు గంటలు అలా వదిలేయాలి.
ఇడ్లీ ప్లేట్ లకు కొంచెం నూనె రాసి పిండిని వేసి ఇడ్లీ పాత్రలో పెట్టి మీడియం మంటపై పది నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ ఇడ్లీలను వారంలో రెండు సార్లు తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారికి అలాగే డయాబెటిస్ ఉన్నవారికి చాలా మంచిది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మంచి పోషకాలు ఉన్న ఆహారం తప్పనిసరి. జొన్నలను పూర్వ కాలంలో చాలా విరివిగా వాడేవారు. మరల ఈ మధ్య కాలంలో జొన్నల వాడకం పెరిగింది. కాబట్టి కాస్త ఓపిక చేసుకొని మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తినటానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మంచి ఆరోగ్యంతో ఉంటాం.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/