పిల్లలు పెద్దల్లో ఎముకలు బలంగా చేసి మలబద్దకాన్ని పోగొట్టి బీపీ షుగర్ కంట్రోల్ చేసే Healthy Breakfast
Jowar Flakes Healthy Breakfast : డయాబెటిస్, రక్తపోటు నియంత్రణలో ఉంచటమే కాకుండా జీర్ణశక్తిని పెంచి మలబద్దకంను తగ్గించి ఎముకలను బలంగా చేసి రోజంతా హుషారుగా ఉండేలా చేసే simple Breakfast గురించి తెలుసుకుందాం. ఈ Breakfast ని వారంలో రెండు సార్లు తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
ఒక కప్పు జొన్న అటుకులను పాన్ లో వేసి పచ్చి పోయే వరకు వేగించాలి. జొన్న అటుకులను ఒక బౌల్ లో వేయాలి. కాస్త చల్లారాక రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసి పెరుగు కలపాలి. ఆ తర్వాత 5 నిమిషాల పాటు అలా వదిలేయలి. ఆ తర్వాత పొయ్యి వేలిగించి పాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి లేదా నూనె వేయాలి.
నూనె కొంచెం వేడి అయ్యాక అరస్పూన్ ఆవాలు,ఒక స్పూన్ పచ్చి శనగపప్పు,ఒక స్పూన్ మినపప్పు,పావు స్పూన్ జీలకర్ర,కచ్చా పచ్చాగా దంచిన పావు స్పూన్ మిరియాలు, రెండు స్పూన్ల పచ్చిమిర్చి ముక్కలు, ఒక స్పూన్ అల్లం ముక్కలు, ఒక ఎండుమిర్చి వేసి బాగా వేగాక కరివేపాకు,ఇంగువ వేసి బాగా కలపాలి.
పెరుగు కలిపిన జొన్నల మిశ్రమంలో తాలింపు వేసుకొని బాగా కలపాలి. జొన్న అటుకులతో తయారుచేసుకున్న దద్దోజనము ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకుంటే రోజంతా అలసట లేకుండా హుషారుగా ఉంటారు. అలాగే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి జీర్ణ సంబంద సమస్యలు ఏమి ఉండవు.
మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. కాస్త ఓపికగా ఇటువంటి మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. జొన్న అటుకులు సూపర్ మార్కెట్ లోనూ,Online stores లోనూ విరివిగానే లభ్యం అవుతున్నాయి. కాబట్టి పెరుగుతో కలిపి ఈ విధంగా చేసుకొని తినండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.