Healthhealth tips in telugu

Lungs Health:1 గ్లాస్ 3 రోజులు తాగితే గొంతు,ఊపిరితిత్తుల నుండి శ్లేష్మంను బయటకు పంపి లంగ్స్ ని శుభ్రం చేస్తుంది

Onion And apple Tea Benefits : సీజన్ కాస్త మారటంతో దగ్గు,జలుబు,గొంతునొప్పి వంటివి వస్తూ ఉంటాయి. అలాగే ఊపిరితిత్తుల సమస్యలు రాకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పే టీ తాగితే చాలా మంచి ఉపశమనం కలుగుతుంది. శ్వాసనాళాలను శుభ్రం చేయటమే కాకుండా ఊపిరితిత్తులను క్లియర్ చేస్తుంది.
apple
ఈ టీ తాగితే గొంతు మరియు ఊపిరితిత్తుల నుండి శ్లేష్మంను బయటకు పంపుతుంది. ఈ టీ ఎలా తయారుచేయాలో చూద్దాం. ఒక ఆపిల్ ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఒక వెల్లుల్లి రెబ్బను తొక్క తీసి క్రష్ చేయాలి.

ఆ తర్వాత ఒక అంగుళం అల్లం ముక్క తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఒక గిన్నెలో ఆపిల్ ముక్కలు,ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, అల్లం ముక్కలు, పావు స్పూన్ దాల్చినచెక్క పొడి, 5 గ్లాస్ ల నీటిని పోసి పొయ్యి మీద పెట్టి పది నిమిషాల పాటు మరిగించాలి. ఈ డ్రింక్ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక గ్లాసు లో పోసి ఒక స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి.
Ginger benefits in telugu
ఈ విధంగా ఉదయం ఒకసారి,సాయంత్రం ఒకసారి తీసుకుంటే దగ్గు,జలుబు,గొంతు నొప్పి తగ్గటమే కాకుండా గొంతు నుండి మరియు ఊపిరితిత్తుల నుండి శ్లేష్మంను బయటకు పంపి ఊపిరితిత్తులను క్లియర్ చేస్తుంది. అలాగే శ్వాసనాళాలను శుభ్రం చేస్తుంది. ఉల్లిపాయలో క్వెర్సెటిన్‌ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ సమృద్దిగా ఉంటుంది.
Honey
ఇది దగ్గు మరియు శ్లేష్మంను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది. జలుబు,దగ్గు, సైనసెస్, గొంతు నొప్పి తగ్గించటానికి వెల్లుల్లి చాలా బాగా పనిచేస్తుంది. ఈ డ్రింక్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచటానికి సహాయపడుతుంది. ఈ డ్రింక్ మూడు రోజులు తాగితే చాలు ఊపిరితిత్తులను క్లియర్ చేసి ఎటువంటి సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.